ఈ మద్య వెండితెరపై కన్నా బుల్లితెరపై యాంకర్లు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే.  సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ తో రాణిస్తే తప్ప హీరోయిన్స్ కి పెద్దగా పేరు ఉండదు.   కానీ మంచి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకుంటే బుల్లితెరపై చాలా పాపులర్ కావొచ్చు.  ఈ నేపథ్యంలో తెలుగు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నవారు సుమ కనకాల, అనసూయ, రష్మీ, శిల్పా చక్రవర్తి లాంటి వారు ఉన్నారు.   తాజాగా  మిర్చి చిత్రంతో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మాధవి ఓ యు ట్యూబ్ ఛానల్ యాంకర్ పై చేయి చేసుకుంది.  

ఓ యు ట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ సాగుతున్న సమయంలో హఠాత్తుగా సదరు యాంకర్ అడగకూడని ప్రశ్న అడిగాడు దాంతో మాధవి కి ఎక్కడా లేని కోపం వచ్చేసింది అంతే టక్కున తన పక్కన ఉన్న దిండు ని యాంకర్ పై విసిరి కొట్టి ఏం మాట్లాడుతున్నావ్ ? అది నోరేనా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేచి విస విసా వెళ్ళిపోయింది. మరి నటి మాధవికి ఇంతగా కోపం తెప్పించిన విషయం ఏంటా అని అనుకుంటున్నారా..! తెలుగులో ఇన్ని సినిమాల్లో నటిస్తున్నావ్ కదా ? మిమ్మల్ని ఏ డైరెక్టర్ అయినా వాడుకున్నారా ? అని ప్రశ్నించడంతో మాధవికి ఎక్కడో కాలిందట.  

వెంటనే యాంకర్ ని తిట్టి ఆ షో నుంచి వెళ్లిపోయింది.  అయితే ఈ మద్య సినిమా హీరోయిన్స్ తమను ఇండస్ట్రీలో చాలా మంది వాడుకున్నారని, లైంగికంగా వేధించారని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు.  కొంత మంది హీరోయిన్లు అయితే ఏకంగా పడకగది లోకి రమ్మని వేధించే హీరోలు దర్శక నిర్మాతలు ఉన్నారని గతకొంత కాలంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ యాంకర్ అలా అడిగాడు దాంతో మిర్చి మాధవి ఆగ్రహంతో ఊగిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: