అందాల నటుడు శోభన్ బాబు తన కెరీర్ ప్రారంభంలో ఎంతో కష్టపడ్డారు. వేషాల కోసం ఆయన తిరిగన చోటు లేదు. కలవని సినీ ప్రముఖులు లేరు. అవి ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో ‘సీతారామ కళ్యాణం’ సినిమాను ప్రారంభిస్తున్న రోజులు. ఈ సంగతి తెలిసిన శోభన్ బాబు ఎన్టీఆర్ ను కలవడానికి వెళ్లారు. అప్పటికే ‘దైవబలం‘ సినిమా షూటింగ్ ద్వారా ఇద్దరికి పరిచయం ఉంది. ఎన్టీఆర్ శోభన్ బాబు ను గుర్తుపట్టి విషయం అడిగారు. శోభ న్ బాబు లక్ష్మణుడి వేషం కావాలని అడిగారు. (అప్పటి కే హరనాథ్ రాముడి పాత్రకు ఎంపిక అయ్యారు) వెంటనే ఎన్టీఆర్ అంగీకరించారు. పాత్ర ఇవ్వడమే కాకుండా పవిత్రమైన పాత్రలు పోషిస్తున్నప్పుడు ఓక నటుడు ఎలా నడుచుకోవాలో కూడా షూటింగ్ సమయంలో శోభన్ బాబుకు ఎన్టీఆర్ బోధిస్తుండేవారట.  అవి శోభన్ బాబు కు భవిష్యత్ కాలంలో ఎంతో ఉపయోగ పడ్డాయని ఆయన స్వయంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: