మహేష్ ఇప్పుడు కూతురు సితారతో ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. కొడుకు గౌతమ్, కూతురు సితార పక్కన కూర్చుంటే సమయం కరిగిపోతున్న సంగతే అంతుబట్టట్లేదట. ఈ విషయాన్ని గురించి ఈ మధ్య మహేష్ చెప్పుకొచ్చారు. ‘‘ఇంతకు ముందు కనీసం అప్పుడప్పుడైనా కోపమొచ్చేది. కానీ ఇప్పుడు అసలు కోపం రావట్లేదు. ఒకవేళ ఎప్పుడన్నా అసహనంగా అనిపించినా వెంటనే పిల్లల ముఖాలు గుర్తుకొస్తున్నాయి. కోపం పటాపంచలయిపోతోంది’’ అని అన్నారు మహేష్.
మరింత సమాచారం తెలుసుకోండి: