అల్లరి నరేష్ నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రానికి యముడికి మొగుడు అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే టైటిల్ తో 1980ల్లో మెగా స్టార్ చిరంజీవి సినిమా ఒకటి వచ్చిన సంగతి తెలిసిందే.
అంతే కాకుండా ఈ అల్లరి నరేష్ యముడికి మొగుడు సినిమాలో ‘అత్తో అత్తమ్మ కూతురో..’ అనే రీమిక్స్ సాంగ్ ను పెడుతున్నారు. ఇది కూడా చిరంజీవి నటించిన అల్లుడు మజాకా.. సినిమాలో సాంగ్ అన్న విషయం తెలిసిందే. దీంతో, అల్లరి నరేష్ చిరంజీవి అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఫిల్మ్ నగర్ వాసులు కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటికే చిరు అభిమానులను ఆకర్షించడానికి మెగా ఫ్యామిలి కి చెందిన హీరోలు కృషి చేస్తుండగా, వారికి పోటీకి అల్లరి నరేష్ తయారు అవ్వతున్నట్లు కనిపిస్తుందని వారు గుసగుస లాడుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: