తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నాని నటించిన ఎవడే సుబ్రమాణ్యం ముఖ్యపాత్రలో నటించాడు.  ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లిచూపులు చిత్రంతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. 
Image result for vijay devarakonda childhood
అయితే విజయ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో 1999 సమయంలోది. అప్పట్లో షావుకారు జానకితో కలిసి విజయ్, ఓ టీవీ సీరియల్ లో నటించాడు.

దీన్ని సంపాదించిన ఓ అభిమాని, విజయ్‌ దేవరకొండను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అయితే ఈ వీడియో చూసి తాను ఎంతగానో సంతోషించానని..చిన్ననాటి వీడియో మరోసారి చూడటం చాలా థ్రిల్ గా అనిపించిందని.. వీడియోను పోస్టు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: