విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్‌కు ఓవర్సీస్ ప్రీమియర్ల తర్వాత పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో విజయ్ - రష్మిక మధ్య స్క్రీన్ మీద కెమిస్ట్రీ బాగా పండిందని.. ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజ్ ఎపిసోడ్ బాగుందని... విజయ్, రష్మిక నటన సూపర్బ్‌గా ఉందని కితాబు ఇస్తున్నారు. ఇక సినిమాలో ప్లస్‌ల గరించి మాట్లాడుకోవాల్సి వస్తే విజయ్ మరియు రష్మిక మధ్య స్క్రీన్ మీద వచ్చే ప్రేమ సన్నివేశాలు, కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందంటున్నారు.
క్లైమాక్స్ లోని సందేశంతో పాటు పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రపీ... ఓవరాల్‌గా నిర్మాణ విలువలు కూడా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. మైనస్‌ల విషయానికి వస్తే సినిమాలో సాగదీత సీన్లు చాలానే ఉన్నాయి. దీనికి తోడు ఎడిటింగ్ క్రిస్పీగా లేదు. 170 నిమిషాల రన్ టైంతో సినిమాను చూడాలంటే కష్టంగానే ఉందట. ఫస్టాఫ్‌లోనే కొన్ని సీన్లు సాగదీసినా కాస్త ఓపికతో చూడొచ్చు. ఇక సెకండాఫ్‌లో మరీ సాగదీసినట్టు ఉన్నాయి. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం కూడా మైనస్.
మొత్తంగా తొలి ప్రయత్నంలోనే దర్శకుడు భరత్ కమ్మ నిజాయితీతో కూడిన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసినా కొత్తదనం లేని కథను తీసుకోవడంతో కొన్ని చోట్ల తడబడినట్టే ఉంది. విజయ్ - రష్మిక జంట, ఎమోషనల్ సీన్లు ప్లస్‌లు అయితే కొత్తదనం లేని కథ, స్లో నెరేషన్ మైనస్. బాక్సాఫీస్ దగ్గర రూ.34 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా విజయ్ చరిష్మాతో గట్టెక్కుతుందా ? లేదా ? అన్నది ఫస్ట్ వీక్‌కే క్లారిటీ రానుంది.