బాలీవుడ్ లో సూపర్ హిట్టైన స్పెషల్ చిట్ చాట్ షో ఫీట్ అప్ విత్ స్టార్స్. తారల బెడ్ రూం విషయాల గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఏం లేకున్నా ఉన్నట్టు రకరకాల వార్తలు రాసే ప్రస్తుతం సోషల్
మీడియా ప్రపంచంలో వారి సీక్రెట్స్ గురించి వారే ఓపెన్ గా చెబితే ఆ కిక్కు వేరేలా ఉంటుంది.
ముఖ్యంగా ఆ స్టార్ అభిమానులకు వారి గురించి ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంటుంది. ఇక
బాలీవుడ్ నుండి రీసెంట్ గా తెలుగుకి ఈ షో వచ్చింది. మంచు
లక్ష్మి హోస్ట్ గా ఫీట్ అప్ విత్ స్టార్స్ షో వస్తుంది. వూట్ యాప్ లో మాత్రమే ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పటికే ఎంతోమందిని ఈ షోలో పాటిస్పేట్ చేసేలా చూసిన మంచు
లక్ష్మి లేటెస్ట్ గా
కాజల్ తో స్పెషల్ చిట్ చాట్ చేసింది.
తెలుగు,
తమిళ భాషల్లో సూపర్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయిన
కాజల్ తన కెరియర్ లో ఒక హీరోతో రొమాన్స్ చేసేందుకు మాత్రం ఇబ్బంది పడ్డదట. అది ఎవరో మంచు
లక్ష్మి బయట పెట్టించేసింది. సౌత్ లో క్రేజ్ వచ్చిన హీరోయిన్స్ కు
బాలీవుడ్ మీద ఆశ ఉంటుంది. అలానే
కాజల్ హింది సినిమాలు చేసింది.
2016లో తను చేసిన దో లఫ్జోన్ కే కహాని సినిమాలో నటుడు రణదీప్ హుడాతో రొమాన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డా అని చెప్పింది కాజల్. అందులో తనది అంధురాలి పాత్ర ఆ పాత్రలో ఉండి తెలియని వ్యక్తితో రొమాన్స్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది. సినిమాలో ఇద్దరి మధ్య
ప్రేమ చూపించడానికి రొమాంటిక్ సీన్స్ చేసినా ఆ సీన్స్ చేయడానికి తాను ఇబ్బంది పడ్డ విషయాన్ని చెప్పారు కాజల్. ప్రస్తుతం హిందిలో కాల్ సెంటర్, ముంబై సాగా చేస్తుండగా తమిళంలో ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తుంది.