టాలీవుడ్ సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు గారు గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. పలు చిత్రాల్లో తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించిన మారుతీరావు గారు మంచి రచయిత, సాహితీవేత్త కూడా. ఇక గత కొద్దిరోజలుగా అనారోగ్యంతో సతమతం అవుతున్న ఆయనను ఇటీవల కుటుంబసభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. కొన్నేళ్ల క్రితం సినిమాలు పూర్తిగా తగ్గించిన మారుతీరావు గారు, చాలా తక్కువగా ఎక్కడో అక్కడక్కడా చిన్న పాత్రల్లో మాత్రమే నటిస్తున్నారు. 

ఇక కొద్దిరోజుల నుండి చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం, ప్రస్తుతం కొంత పర్వాలేదని అక్కడి డాక్టర్లు చెప్తున్నట్లు సమాచారం. ఇకపోతే నేడు భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు నాయుడు గారు ప్రత్యేకంగా ఆసుపత్రికి వెళ్లి గొల్లపూడి గారిని పరామర్శించి, ధైర్యం చెప్పడం జరిగింది. మారుతీరావు గారు తెలుగు సినిమాకు, అలానే తెలుగు భాష అభ్యున్నతికి చేసిన సేవలు మనం ఎప్పటికీ మరువలేవని, తప్పకుండా ఆయన అతి త్వరలో కోలుకుని మళ్ళి మన అందరి మధ్యకు వస్తారని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

ఇక ప్రస్తుతం ఈ వార్త బయటకు రావడంతో పలువురు సినిమా రంగ ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో పుస్తకాలను రచించడంతో పాటు కొన్ని సినిమాలకు కథలు, మాటలు అందించడం, ముఖ్యంగా చిన్న పిల్లలు కథలు రాయడంలో ఎంతో గొప్ప పేరు సంపాదించిన గొల్లపూడి గారు, తెలుగులో ఇప్పటివరకు 230కి పైగా చిత్రాల్లో నటించడం జరిగింది. కెరీర్ తొలినాళ్లలో ఆల్ ఇండియా రేడియోలో కొన్నేళ్ల పాటు పని చేసి మంచి పేరు సంపాదించిన గొల్లపూడి గారు, కొన్నాళ్ళు జర్నలిస్టుగా కూడా పని చేసారు. అయితే ఆ తరువాత ఆయన సినిమా రంగ ప్రవేశం చేయడం జరిగింది రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి, తెలుగు సాహితీ వేత్తగా పలు విధాలుగా సేవలందించిన గొల్లపూడి గారు త్వరగా కోలుకుని మళ్ళి మనందరినీ అలరించాలని ఆశిద్దాం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: