జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు సుడిగాలి సుధీర్. ఇతని స్పెషలిటీ ఏంటంటే.. తన రొమాంటిక్ క్యారెక్టర్ తో అందర్నీ కడుపుబ్బా నవ్వించడం. ఈ ప్లస్ ని పక్కన పెడితే.. ఆయన వ్యక్తిత్వం కూడా బంగారమే అని తెగ మెచ్చుకుంటారు సుధీర్ అభిమానులు. అయితే, అటువంటి అభిమానులను అలరించాలనే ఉద్దేశంతోనే వెండి తెరపై 'సాఫ్ట్ వేర్ సుధీర్' గా అవతారమెత్తారు ఆయన. అయితే, ప్రస్తుతం థియేటర్ల లో ఆడుతున్న అతను నటించిన చిత్రం అభిమానులను బాగా అలరిస్తుంది. మరొకవైపు మాత్రం ఈ చిత్రం గురించి కాస్త నెగటివ్ టాక్ వినిపిస్తుంది.


జబర్దస్త్ షో నుండి వచ్చిన షకలక శంకర్, ధనరాజు తో సహా సుధీర్ కూడా హీరో అయ్యారు, అందుకే తాను కూడా హీరో అవుతానని హైపర్ ఆది తెగ చెప్పుకుంటున్నాడట. ఇంకా, తాను బుల్లితెరపై దుమ్మురేపుతున్నట్లు వెండి తెరపై కూడా దూసుకెళ్తానని ఆది సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. కానీ, జబర్దస్త్ హాస్యనటుల చిత్రాలు అంతగా ప్రజల ఆదరణ పొందలేకపోయాయి. సుధీర్ సినిమాకి కూడా నెగటివ్ టాక్ వస్తుంది. దాంతో, సుధీర్ సినిమా ఫలితం తనని గజగజ లాడిస్తుందని ఆది ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

 

హీరో అవ్వాలని తెగ ఉవ్విళ్ళూరుతున్న ఆది ప్రస్తుతం కథలు వింటున్నాడట. అయితే డాన్సులు, ఫైట్లు గట్రా లేకుండా పూర్తిగా హాస్యభరిత సినిమాలో నటిస్తానని ఆది చెప్పాడు. కానీ నెటిజన్లు మాత్రం సుధీర్ కష్టపడి డాన్సులు, ఫైట్లు చేస్తేనే నెగటివ్ టాక్ వినిపిస్తుంది.. మరి నువ్వు కేవలం జోకులు తప్ప మరేమి చేయనంటే ప్రేక్షకులు చూస్తారా అని ఎగతాళిగా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, ఆది వెండి తెరపై హీరోలా మెరిస్తే చూడాలని ఉందని మరికొందరు కోరుకుంటున్నారు. ఆది ఎటువంటి పంచులతో వెండి తెర ద్వారా అభిమానుల ముందుకు వస్తాడో చుడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: