‘పింక్’ రీమేక్ షూటింగ్ మొదలైనా ఈమూవీకి హీరోయిన్ గా ఎవరు సూటు అవుతారు అన్న విషయం పై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు అని తెలుస్తోంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నా ఆమె డేట్స్ విషయంలో చాల సమస్యలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో తన మూడ్ కు తగ్గట్టుగా నటించే పవన్ కు పూజ హెగ్డే డేట్స్ కు సెట్ చేయడం చాల కష్టసాధ్యంగా మారిందని అంటున్నారు. దీనికితోడు ఈసినిమాలో హీరోయిన్ పాత్ర ఒక బిడ్డకు తల్లి. ఈపాయింట్ ను ఆధారంగా చేసుకుని చాలామంది టాప్ హీరోయిన్స్ నటించడానికి ఒప్పుకోవడం లేదు అని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్న రకుల్ ప్రీత్ ఇష్టపడుతున్నా ఇంత బరువైన పాత్ర ఆమె చేయగలదా అన్న ఆలోచనలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్యలో ఈపాత్ర కోసం ‘మళ్ళీ రావా’ ‘దేవదాస్’ సినిమాలో నటించిన ఆకాంక్ష సింగ్ తో కూడ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈసినిమా కథలో కొన్ని మార్పులు చేసిన వేణు శ్రీరామ్ కు ఈ మూవీలో ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేసి ఆ పాత్రను రేణు దేశాయ్ చేత నటింప చేస్తే ఈ మూవీకి క్రేజ్ మామూలుగా ఉండదు అన్న ఆలోచనలు వచ్చినట్లు టాక్. 


రేణు మళ్ళీ సినిమాలలోకి రావడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. రేపు విడుదల కాబోతున్న ‘చూసి చూడంగానే’ మూవీలో కూడ ఆమెకు ఒక ప్రత్యేక పాత్రను ఇచ్చినా ఆమె చివరి నిముషంలో నటించడానికి అంగీకరించలేదు. దీనితో వేణు శ్రీరామ్ ఆలోచనలకు రేణు దేశాయ్ ఒప్పుకున్నా పవన్ ఒప్పుకుంటాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్ సినిమాలో మాత్రం విడిపోయిన భార్య భర్తలు అదేవిధంగా విడిపోయిన పాత ప్రేయసీ ప్రేమికులు తిరిగి నటిస్తున్న పరిస్థితులలో నిజంగానే రేణు పవన్ ల కాంబినేషన్ ‘పింక్’ లో సెట్ కాగలిగితే దిల్ రాజ్ కు ఈసినిమా బిజినెస్ గురించి ఏర్పడిన భయాలు పూర్తిగా సమసిపోతాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: