సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటించిన హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ `జాను`. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ సినిమాకు ఇది రీమేక్. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగు వర్షన్‌ను తెరకెక్కించారు. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. అక్కడ ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్లు, ట్రైలర్లు యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్నాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


 
ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. జాను ఊహల్లో నుంచి ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ మొదల‌వుతుంది.  అందరూ ఎదురు చూస్తున్న జానుగా సమంత ఎంట్రీ ఇచ్చింది.. చాలా సింపుల్ లుక్ లో క్లాస్ గా ఎంట్రీ ఇచ్చింది. తన ఎంట్రీలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి ఫీల్ లోకి తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. ఫ్లాష్ బ్యాక్ ఓవర్‌లో రామ్ & జానుల టెన్త్ బ్యాచ్ గెట్ టుగెదర్ మొదలైంది. రామ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా వెన్నెల కిషోర్ మ‌రియు శరణ్య ప్రదీప్ లు ఎంట్రీ ఇస్తారు. జాను – రామ్స్కూల్ డేస్ లవ్ చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తున్నారు. జాను స్కూల్ కి రానప్పుడు రామ్ టెన్షన్ పడే సీన్స్ ని చాలా బాగా తీశారు. 

 

ఫీల్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. స్కూల్ డే లో రామ్ గా సాయి కిరణ్, జానుగా గౌరీ గీత కిషన్ లు ఎంట్రీ ఇచ్చారు. స్కూల్ లో వీరిద్దరి మధ్యా జరిగే సీన్స్ చాలా బాగున్నాయ్. చూసే వారందరికీ వారి స్కూల్ డేస్ & ఫస్ట్ లవ్ ని ఖ‌చ్చితంగా గుర్తు చేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే కథలో ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అదిరిపోయే యాక్షన్స్ ఎపిసోడ్స్ లాంటివి ఏం లేకుండా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా సాఫీగా సాగిపోయే కథతో.. కేవలం పాత్రల ద్వారా జరిగే మ్యాజిక్‌తో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టేసింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: