ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల కేసులు నమోదు అవుతున్నాయి.  చిన్న పిల్లలను కూడా ఈ కామాంధులు వదలడం లేదు.. పైగా తమ గుట్టు రట్టు అవుతుందని వారిని దారుణంగా హత్యలు కూడా చేస్తున్నారు.  ఇటీవల తెలంగాణలో దిశ అనే వెటర్నరీ డాక్టర్ ని నలుగురు కామాంధులు అత్యాచారం చేసి.. దహనం చేసిన ఘటనలో అరెస్ట్ కావడం జరిగింది.  ఆ కామాంధులను విచారిస్తున్న తరుణంలో పోలీసులపై దాడి చేయడంతో వారిని ఎన్ కౌంటర్ చేయడం జరిగిందని పోలీస్ అధికారులు వెల్లడించారు.  ఇక తెలంగాణలోనే సమత అనే మహిళలపై అత్యాచారం చేసిన ముగ్గురు నింధితులకు ఫాస్ట్ కోర్ట్ ఉరిశిక్ష విధించింది.

 

అలాగే ముగ్గురు అమ్మాయిలను అనుభవించిన వారిని దారుణంగా హత్య చేసిన హాజీపూర్ గ్రామ వాసి శ్రీనివాస్ రెడ్డిపై త్వరిత గతిన కోర్టు విచారణ చేయడం.. ఉరిశిక్ష ఖరారు చేయడం కూడా జరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనాలు రేపిన ఈ ఘటనలు చూసి కూడా కామాంధుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదని వారు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం ద్వారా ఎంతో మంది నటీమణులు, ఇతర రంగాల్లో పనిచేసేవారు ముందుకు వస్తూ తమపై లైంగిక దాడులకు పాల్పపడిన వారిని వివరాలు తెలియజేస్తున్నారు. 

 

తాాజాగా బాలీవుడ్ నటుడు.. ఒకప్పుడు బుల్లితెరపై మహాభారతం సీరియల్ లో అర్జును పాత్రలో నటించిన షహ్బాజ్ ఖాన్ పై  ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 354, 509 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలికను లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ నటుడు షహ్బాజ్ ఖాన్ పై కేసు నమోదు అయ్యిందని..  కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: