‘భీష్మ’ సినిమాను ప్రమోట్ చేస్తూ వరసపెట్టి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తున్న నితిన్ కు ఇటీవల కాలంలో ఏ టాలీవుడ్ హీరోకు ఎదురుకాని పరిస్థితి ఎదురవుతోంది అన్న బాధలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో ప్రతి హీరో తమ సినిమా గురించి ప్రతిక్షణం మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.   


అయితే ‘భీష్మ’ మూవీ ప్రమోషన్ లో ఈ పరిస్థితికి భిన్నంగా నితిన్ కు కొన్ని అనుభవాలు ఎదురు అవుతున్నాయి. ఈమధ్యనే నితిన్  రియల్ లవ్ స్టోరీ బయటకురావటం పెళ్లి ఫిక్స్ కావటంతో మీడియా ఆసక్తి అంతా ఆ అంశాల మీదనే పెడుతూ ఛానల్స్ అదేవిధంగా పత్రికలు తాము నిర్వహించే స్పెషల్ ఇంటర్వ్యూలలో ‘భీష్మ’ గురించి కాకుండా నితిన్    ప్రేమ పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడగడం నితిన్ కు ఏమాత్రం నచ్చడం లేదు అని టాక్.   


దీనితో పర్సనల్ విషయాలు ఇవాళ కాకుంటే రేపైనా మాట్లాడుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమా ఆయుష్షు రెండు వారాలు మించి లేకపోవడంతో తన పెళ్లి గురించి ప్రశ్నలు తగ్గించి ‘భీష్మ’ సినిమా గురించి ఎక్కువ ప్రశ్నలు అడగమని కోరినా నితిన్ సూచనలు మీడియా వర్గాలు పట్టించుకోవడం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి.   


ఇది ఇలా ఉండగా ఈ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ నిశ్చితార్థానికి 2 రోజుల ముందే నితిన్ లవ్ మేటర్ తెలిసింది అని చెప్పడం బట్టి నితిన్ తన ప్రేమ వ్యవహారాన్ని తెలివిగా ఎంత రహస్యంగా మేనజే చేసాడో అర్ధం అవుతుంది. నితిన్ తో వర్క్ చేస్తుంటే ఒక కాలేజ్ ఫ్రెండ్ తో కలిసి పనిచేస్తున్న ఫీలింగ్ వచ్చింది అని చెపుతున్న రష్మిక  మాటలను బట్టి  నితిన్ కు ఇగో లేదు అన్నవిషయం మరో సారి బయటపడింది ఇలాంటి పరిస్థితులలో నితిన్ అభిప్రాయాన్ని ఎంతవరకు మీడియా గౌరవిస్తుందో చూడాలి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: