తెలుగు సినిమా కమెడియన్స్ గురించి చెప్పుకుంటే కచ్చితంగా ఏ.వి.ఎస్ ప్రస్థావన వస్తుంది. ఆయన చేసే ప్రతి పాత్రలో ఏదో ఒక వైవిధ్యత చూపించే విలక్షణ నటుడు ఆయన. ఏ.వి.ఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. వెంకట సుబ్రహ్మణ్యం అని ప్రతిసారి పలకడం కష్టం కనుక ఏ.వి.ఎస్ అని షార్ట్ కట్ లో చెబుతారు. ఆ పేరుతోనే ఆయన చాలా ఫేమస్ అయ్యారు. బాపు డైరెక్ట్ చేసిన మిస్టర్ పెళ్లాం సినిమాతో కమెడియన్ గా మారిన ఏ.వి.ఎస్ ప్రతి సినిమాలో తన మార్క్ చూపించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
దర్శకుడు చెప్పిన పాత్రకు తన అభినయంతో పాత్రని మరో లెవల్ కు తీసుకెళ్లేవారు ఏ.వి.ఎస్. కేవలం తెలుగు సినిమాల్లోనే నటించిన ఏ.వి.ఎస్ మిస్టర్ పెళ్లాం నుండి దాదాపుగా 90కి పైగా సినిమాల్లో నటించారని తెలుస్తుంది. తనకు కమెడియన్ గా ఇంత పేరు తెచ్చిపెట్టిన సిని పరిశ్రమకు తాను ఏదైనా చేయాలని దర్శకుడిగా, నిర్మాతగా మారి కొన్ని ప్రయత్నాలు చేశారు ఏ.వి.ఎస్. ఏ.వి.ఎస్ డైఅక్షన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి. నిర్మాతగా ఆయన రెండు సినిమాలు చేశారు. ఇవేవి ప్రేక్షకాదరణ పొందలేదు.
ఏ.వి.ఎస్ ఏదైనా పాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాత్ర గురించి దర్శకుడు ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్పుకునేవారు. దర్శకుడు చెప్పిన ఆ పాత్రకు ఇంప్రవైజ్ చేసుకుని ఆ పాత్ర స్వభవానికి తగ్గట్టుగా కొత్త హావభావాలు పలికించే వారు. ఈ విషయంలో కచ్చితంగా ఏ.వి.ఎస్ గారిని స్పెషల్ గా మెచ్చుకోవాల్సిందే. ఆయన ఎలాంటి పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే తీరు అద్భుతంగా ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కు 3 సార్లు సెక్రెటరీగా పనిచేశారు ఏ.వి.ఎస్. 2013 నవంబర్ 8న ఏ.వి.ఎస్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతోనే ఆయన మరణించారు. ఏ.వి.ఎస్ లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమలో స్పష్టంగా కనిపిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి