ప్రముఖ సింగర్ బిగ్ బాస్ విజేత నటుడు రాహుల్  సిప్లిగంజ్  హైదరాబాద్లోని ఓ పబ్లో దాడి జరగడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి రాహుల్ సిప్లిగంజ్ కొంతమంది స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కి వెళ్లగా అక్కడ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు రాహుల్  సిప్లిగంజ్ పై బీర్ బాటిల్స్ తో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన టాలీవుడ్ లో సంచలనం గా మారిపోయింది. ఈ ఘటనలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి తీవ్ర రక్తస్రావం కావడంతో... వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ దాడి పై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయను  అంటూ చెప్పిన రాహుల్  సిప్లిగంజ్  ఆ తర్వాత... టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిత్ రెడ్డి సహా పలువురు బంధువులఫై  కూడా ఫిర్యాదు చేశాడు.. తన స్నేహితుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం తో పాటు దాడి దిగినట్టు   ఫిర్యాదులో పేర్కొన్నాడు రాహుల్ సిప్లిగంజ్. 

 

 

 అంతేకాదు పబ్లో జరిగిన దాడికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన మంత్రి కేటీఆర్ ను కూడా న్యాయం చేయాలని కోరిన విషయం తెలిసిందే. తాను కూడా తెలంగాణ పౌరుడు నేనని తను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానని తనకు న్యాయం చేయాలంటూ కేటిఆర్ ని   కోరాడు. అంతేకాకుండా గాయాలతోనే ఓ వీడియోని విడుదల చేస్తూ... తనతో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారని ఇంకో ముగ్గురు ఉంటే పబ్ లో గొడవ మస్తు మజా వచ్చేది అంటూ రాహుల్ సిప్లిగంజ్ చెప్పుకొచ్చాడు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడిని అని దర్పంతో చూపెట్టుకోవడానికి తనపై దాడికి దిగారు అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఆరోపించాడు. అయితే తాజాగా ఈ ఘటనపై రాహుల్ సిప్లిగంజ్ తల్లి  స్పందించారు. 

 

 

 ఆ రోజు సాయంత్రం తమ కొడుకు రాహుల్ సిప్లిగంజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని... రాత్రికి ఇంటికి రాలేదు అంటూ రాహుల్ సిప్లిగంజ్ తల్లి తెలిపారు. కానీ ఫోన్ లో తండ్రి తో మాట్లాడినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తమ కొడుకు పై పబ్లో జరిగిన దాడి గురించి తమకు టీవీలో చూసేంత వరకూ తెలియదు రాహుల్  సిప్లిగంజ్ తల్లి తెలిపారు. తన కొడుకు పై దాడి జరిగిందని... ఆసుపత్రికి తీసుకెళ్లారని  విషయం కూడా తమకు తెలియదని... ఉదయాన్నే ఈ విషయం తెలియడంతో ఆస్పత్రికి వెళ్లి రాహుల్  సిప్లిగంజ్ ని  చూశాము అంటూ రాహుల్ సిప్లిగంజ్ తల్లిగారు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: