హీరోయిన్లు ఎప్పుడూ రెండు మూడు ఆప్షన్స్ ను రెడీగా పెట్టుకుంటారు. ఒక చోట అటు ఇటూ అయినా.. మరో చోట కెరీర్ బండిని నడిపించొచ్చు అని ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ జిగేల్ రాణి కూడా ఇలాగే కోలీవుడ్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాట సూపర్ లాంచింగ్ ఇచ్చే హీరో కోసం వెతుకుతోంది. 

 

పూజా హెగ్డే కెరీర్ బిగినింగ్ నుంచే మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ నీ ఫోకస్ చేస్తోంది. తెలుగులో ముకుంద
చేయగానే హిందీకి వెళ్లిపోయింది. అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారో సినిమా చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం కొన్నాళ్లు టాలీవుడ్ కి బ్రేక్ కూడా ఇచ్చింది. 

 

మొహంజదారో మిస్ ఫైర్ అవడంతో ఈమె టాలీవుడ్ కి తిరిగొచ్చింది. ఇక్కడ వరుస సినిమాలతో బిజీ అయింది. అయితే టాలీవుడ్ లో టాప్ చైర్ కు దగ్గరవుతోన్న పూజా, ఇప్పుడీ స్టార్డమ్ ని తమిళ్ కు విస్తరించాలనుకుంటోంది. కోలీవుడ్ లో ఓ సూపర్ హిట్ ఇచ్చే కథ కోసం సంప్రదింపులు జరుపుతోంది. 

 

విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో తుపాకి 2 రాబోతోంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు పూజాని హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ పూజా నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. అయితే పూజా తమిళ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో ముగమూది సినిమాతో కెమెరా ముందుకొచ్చింది పూజా. సో ఇప్పుడు కెరర్ కు పునాదులు వేసిన కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావాలనుకుంటోంది పూజ. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: