మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ముందుగా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్, ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. అయితే వస్తున్న ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వయంకృషితో ఆపై పవర్ స్టార్ గా అభిమానుల నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నారు పవన్. నిజానికి థియేటర్స్ లోకి పవన్ సినిమా వస్తుంది అంటే ఆ జోష్ వేరని చెప్పాలి. ఇక సినిమా విడుదలకు ఎన్నో రోజుల ముందు నుండే ఆయన ఫ్యాన్స్ హడావుడి విపరీతంగా మొదలెడుతుంటారు. ఇక పవన్ ని దగ్గరి నుండి చూసిన వారు కానీ, లేదా ఆయనతో కలిసి సినిమాల్లో పని చేసిన వారు కానీ, తప్పకుండా మళ్ళి మళ్ళి ఆయనతోనే వర్క్ చేయాలని ఆశపడుతుంటారు. 

 

దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, అలానే ఎందరో అభిమాన గణాన్ని సంపాదించుకుని స్టార్ గా ఎంతో పెద్ద హోదాలో కొనసాగుతున్నప్పటికీ, ఆయనలో ఏ మాత్రం గర్వం అనేది కనపడదని, ఇక సెట్స్ లోకి ఒకసారి అడుగు పెట్టిన తరువాత అందరితో ఆయన ఎంతో కలుపుగోలుగా ఉంటారని, లైట్ బాయ్ దగ్గరి నుండి దర్శకుడి వరకు అందరూ పవన్ వేసే జోక్స్ కి పగలబడి నవ్వుతుంటారని ఇప్పటికీ ఎందరో సినిమా ప్రముఖులు చెప్తూ ఉంటారు. ఇకపోతే కేవలం సాధారణ ప్రేక్షకుల్లోనే కాక చాలా మంది సినిమా నటుల్లో కూడా పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారు. 

 

కాగా వారిలో చాలా మంది మాకు పవన్ అంటే ఇష్టం అని చెప్పడం కంటే ప్రేమ, ప్రాణం అని చెప్తుంటారని, దానికి ప్రధాన కారణం పవన్ సినిమాల్లోని పలు ఆసక్తికర అంశాల ప్రస్తావనతో పాటు ఒకసారి పవన్ ని కలిసాక ఆయన పద్ధతులు, వినయం, విధేయలను చూసినవరకు ఎవరైనా ఆయనకు అభిమానులుగా మారిపోతారని అంటున్నారు. పెద్దలకు గౌరవం ఇవ్వడంతో పాటు, హీరోయిన్స్ కి ఎంతో విలువనిచ్చే హీరోల్లో పవన్ ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అని, సెట్ లో ఎవరికైనా ఏదయినా సమస్య వస్తే వెంటనే ఆయన రియాక్ట్ అయి, వారికి సాయం అందించడంతో పాటు వారి సమస్య తీరేవరకు వెన్నంటే ఉంటారని, అందుకే పవన్ అంటే అందరికీ అంత ఇష్టం అని అంటున్నారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: