పద్మభూషణ్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా తేనెమనసులు సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ, ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో హీరోగా అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక పేరు, గుర్తింపుతో పాటు ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. 

 

ఇక కృష్ణ కెరీర్ నిజంగా నేటితరం లోని ఎందరో నటీనటులకు ఆదర్శం అనేది తెలిసిందే. మొత్తంగా 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ, తన కెరీర్ లో దాదాపుగా అన్ని జానర్లలో సినిమాలు చేసి అప్పట్లో ప్రేక్షకులను ఎంతో అలరించారు. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో ఓ వైపు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్న కృష్ణ, పలు మాస్ సినిమాల్లో కూడా నటించారు. అంతకుముందే టాలీవుడ్ లో బడా స్టార్లు గా వెలుగొందుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్ లను సైతం ఒకానొక సమయంలో మించిపోయి, నటుడిగా ఉన్నత శిఖరాలు అందుకున్న కృష్ణ, అప్పట్లో కొన్ని మాస్ సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు గడించారు. 

 

ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి నటులు అప్పటికే మంచి నటులుగా కొనసాగుతున్నప్పటికీ, అప్పట్లో టాలీవుడ్ లో మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ కలిగిన ఏకైక నటుడు కృష్ణ అని, ఆ తరువాత వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, కృష్ణ మాదిరిగా మాస్ లో మంచి ఇమేజ్ దక్కించుకున్నారని ఇప్పటికీ కొందరు సినిమా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఒకకరంగా చెప్పాలంటే టాలీవుడ్ లో మాస్ అనే పదానికి అసలు సిసలైన భాష్యం నేర్పింది కృష్ణే అని, అందుకే అప్పట్లో ఆయన సినిమాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా విపరీతంగా మాస్ జనాల ప్రేక్షకాదరణ లభించేదని వారు అంటున్నారు. ఇక ప్రస్తుతం నేటి తరం సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న ఆయన తనయుడు మహేష్ బాబు కూడా తండ్రి బాటలోనే ఎన్నో మంచి విజయాలు అందుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకెళ్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: