సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ... పిల్లల కోసం అలుపెరగని పోరాటం చేసే త్యాగమూర్తి అమ్మ. అమ్మ గర్భగుడిలో తల దాచుకుంది  పూర్తి మానవ జన్మ . నవమాసాలు కడుపు లో ప్రాణం గా చూసి నెత్తుటి  చుక్కలతో ప్రాణం పోసేది గొప్ప మహిళ అమ్మ . చందమామ కథలతో తన ప్రేమను త్యాగం చేసి... గోరుముద్ద లు  కలిపి... లాలి  పాటలతో తినిపించే ప్రేమే అమ్మ. తన పిల్లలు ఎంత ఎదిగినా తన ముందు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటూ మురిసిపోయేది అమ్మ. పిల్లల విజయాన్నే తన విజయంగా మార్చుకుని... అలుపెరుగని పోరాటం చేసేది అమ్మ. కలియుగ దైవం అమ్మ... కనిపించే ఆరాధ్య దైవం అమ్మ. జన్మనిచ్చిన అమ్మ గురించి ఎంతో గొప్పగా చెప్పిన అది చిన్నమాట గానే మారిపోతుంది. 

 

 

 అలాంటి మాతృమూర్తుల్లో  ఒకరు అక్కినేని అమల. కొడుకు విజయాన్నే తన విజయంగా మార్చుకుని... తాతలు తండ్రులు నుంచి వచ్చిన వారసత్వం నిలబెట్టాలని... తన కొడుకుని ప్రయోజకున్ని  చేయాలని అమల అఖిల్ చిన్న వయసు నుంచే ఎంతో పరితపించి పోయింది. తెలుగులో హీరోయిన్ గా  నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అమల అఖిల్ పుట్టిన తరువాత అఖిల్ కి తన జీవితాన్ని అంకితం చేసింది. అఖిల్ అమల మధ్య ఉన్నటువంటి అనుబంధమే వేరు. చిన్నప్పటి నుంచి తన కొడుకు అఖిల్ నటనలో రాణించాలని కోరుకుంది  అమలా. చిన్నప్పటినుంచి అఖిల్ షూటింగ్ లకు పంపడం మొదలుపెట్టింది.

 

 

 ఎప్పటికైనా అఖిల్ ను  స్టార్ హీరోని చేయాలనే  భావనతో తన కొడుకు విజయాన్ని తన విజయంగా భావించి ఎంతో త్యాగం చేసింది అమల. ఆ తర్వాత కొడుకును అఖిల్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం చేసింది. తన కొడుకును హీరోని చేసి  తన హీరోలను  చేయాలన్న కలను నెరవేర్చుకున్నది  అమల. అఖిల్ ఇప్పటికే రెండు మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించగా...  సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. తన కొడుకు కోసం... కొడుకు విజయం కోసం ఎంతో తాపత్రయ పడి  ఎంతగానో పరితపించే గొప్ప త్యాగమూర్తి అక్కినేని అమల.

మరింత సమాచారం తెలుసుకోండి: