విక్టరీ వెంకటేష్.. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌తో పోటీ ప‌డి స‌క్సెస్‌లు అందుకుంటూ.. రికార్డులు సృష్టిస్తున్నాడీయ‌న‌. వాస్త‌వానికి వెంక‌టేష్‌కు ఉన్న ట్రాక్ రికార్డే వేరు. త‌న త‌రం క‌థానాయ‌కుల‌లో స‌క్సెస్ రేట్ ఎక్కువ ఉన్న స్టార్ త‌నే అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే వెంక‌టేష్ సినీ కెరీర్‌లో రికార్డులు సృష్టించిన సినిమాల జాబితాలో ముందుండే చిత్రం `చంటి`. ఈ చిత్రంలో వెంకటేష్ స‌ర‌స‌న మీనా హీరోయిన్‌గా న‌టించింది. 1992 సంక్రాంతికి  విడుద‌లైన చంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో తెలుగులో విక్టరీ వెంకటేష్ స్టార్ డమ్ తెచ్చుకునీ ఓ క్రేజీ హీరోగా మారిపోయాడు. 

 

అలాగే తన నటనలో పలు రకాల హవా భావాలు వ్యక్తీ కరిస్తు ఈ సినిమా ద్వారా ఓ హీరోగా సత్తా చాటాడు. ఇక వెంకటేష్ తో పాటు నటించిన హీరోయిన్ మీనా, కీలక పాత్రలు పోషించిన నాజర్, మంజుల , సుజాత, బ్రహ్మానందం వంటి వారికి కూడా ఈ సినిమా మంచి పేరును తీసుకొచ్చింది. క్రియేటివ్‌ కమర్షియల్‌ పతాకంపై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో  కె.ఎస్‌.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌ప‌మే అని చెప్పుకోవాలి. అయితే వాస్త‌వానికి చంటి సినిమా తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన `చిన్న తంబి` సినిమాకు రీమేక్‌. 

 

చిన్న తంబి సినిమాలో ప్రభు, ఖుష్బు హీరో,హీరోయిన్లుగా న‌టించారు. వీరుకూడా ఈ సినిమా విజయంతో తమిళసినీ రంగంలో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే సూప‌ర్ హిట్ అయిన‌ ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. ఈ క్ర‌మంలోనే బి.గోపాల్ తన దర్శకత్వంలో బాలకృష్ణతో తీయాలని ముందుగా భావించారు. అయితే ఇంత‌లోనే కె. ఎస్. రామారావు సినిమా హక్కుల్ని కొనేశారు. అయితే ఈయన మాత్రం వెంక‌టేష్‌తో తీద్దామని నిర్ణయించుకున్నారు. 

 

అలానే తీసిన ఈ చిత్రం 9 కోట్ల షేర్స్ రాబ‌ట్టి.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను తిర‌గ‌రాసి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌చింది. అలాగే ఈ సినిమాలో ఇళ‌య‌రాజా స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన‌ మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌చింది. ఇందులోని ప్ర‌తీ పాట ఆబాల‌గోపాలాన్ని అల‌రించింది. దాదాపు 40 కేంద్రాల‌లో ఈ సినిమా శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుని… అప్ప‌ట్లో కొత్త రికార్డును నెల‌కొల్పింది. ఇక ఈ చిత్రం ద్వారా వెంక‌టేష్ క్రేజ్ పీక్స్‌లో చెరింద‌నే చెప్పాలి. అంతేకాదు, ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా ల‌భించింది. అలాంటి చంటి సినిమా ఇప్ప‌టికీ బుల్లితెర‌పై కుటుంబ ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: