బాహుబలి.. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన చిత్రం.. సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి రికార్డులు ఏ సినిమా కూడా నమోదు చేయలేదు.. ఇప్పట్లో చేసే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు వచ్చే రికార్డులను నాన్ బాహుబలి రికార్డులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఓ అమితాబ్ సినిమా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిందట. ఈ విషయం బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ స్వయంగా చెబుతున్నాడు.

 

 

ఇంతకీ ఆ సినిమా ఏంటంటారా.. బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషి కపూర్ కలిసి నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ'. అదేంటి ఇది పాత సినిమా కదా అంటారా.. అవును ఆ సినిమా విడుదలై 43 ఏళ్లు పూర్తైంది. అప్పట్లో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అన్నమాట. ఈ విషయాన్ని అమితాబ్ మరోసారి తాజాగా గుర్తు చేసుకున్నారు. ఇదే సందర్భంలో ఆయన ఈ సినిమాను బాహుబలితో పోల్చారు.

 

 

'బాహుబలి: ది కన్ క్లూజన్' కంటే 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఎక్కువ వసూళ్లను రాబట్టిందని అమితాబ్ అంటున్నారు. ఎందుకో కూడా ఆయన వివరిస్తున్నారు. 43 ఏళ్ల క్రితం ఆ రోజుల్లోనే ఈ చిత్రం అప్పట్లో రూ. 7.25 కోట్లను రాబట్టిందట. ఇప్పటి కరెన్సీతో పోలిస్తే.. అప్పటి కరెన్సీ విలువ చాలా తక్కువ కాబట్టి.. ఇప్పటి లెక్కల్లో దాన్ని మొత్తం రూ. 543 కోట్లు వసూలు చేసినట్టు అమితాబ్ లెక్కలు వేశారు.

 

 

'అమర్ అక్బర్ ఆంటోనీ' ముంబైలో 25 థియేటర్లలో 25 వారాల పాటు ఆడిందట. 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా వసూళ్లు రూ. 7.25 కోట్లు. 43 ఏళ్ల క్రితం టికెట్ విలువ రూ. 2 ఈ లెక్కన మొత్తం 3,62,50,000 మంది సినిమా చూశారట. ఇదే లెక్కను ఇప్పటికి పోల్చి చూస్తే.. 'బాహుబలి-2' విడుదల నాటి టికెట్ ధర రూ. 150తో లెక్కిస్తే... మొత్తం రూ. 543 కోట్లు వసూలు చేసినట్టు లెక్క తేలుతోందట. అంటే.. 'బాహుబలి-2' చిత్రం ఇండియాలో రూ. 510 కోట్లు రాబట్టింది. సో.. అమితాబ్ లెక్క ప్రకారం బాహుబలి కంటే మరో 30 కోట్లు ఎక్కువే అమర్ అక్బర్ ఆంటోనీ రాబట్టిందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: