మెగా ప్రిన్సెస్ నిహారిక ను పెళ్ళి చేసుకునే అబ్బాయి ఫోటో పూర్తిగా బయటకు రావడంతో నిన్న సోషల్ మీడియాలో మెగా అభిమానుల మధ్య మాత్రమే కాకుండా అందరిలోనూ ఆ ఫోటో ట్రెండింగ్ గా మారింది. మెగా ఫ్యామిలీ కొత్త అల్లుడు ఫోటో బయటపడటంతో అతడి వివరాలు తెలుసుకుందామని చాలామంది చాల విధాలుగా ప్రయత్నాలు చేయడంతో చివరకు ఆ వివరాలు బయట పడ్డాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు నిహారిక కాబోయే భర్త చైతన్య ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అని వార్తలు వచ్చాయి. ఒక పోలీసు ఉన్నతాధికారి కుమారుడు అయిన చైతన్య బిట్స్ పిలానీలో మేనేజ్మెంట్ గ్రాడ్యూయేట్ అని టాక్. నిహారిక కాబోయే భర్త ఫోటో బయటకు రావడంతో ఆరడుగుల ఆజానుభాహుడుగా అంతకుమించి పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఎంతో స్టైలిష్ గా కనిపించడంతో నిహారిక సెలెక్షన్ కు మెగా అభిమానులు ఫిదా అయిపోతున్నారు. 


ఇప్పుడు ఈ ఫోటో మెగా అభిమానుల మధ్య వైరల్ కావడంతో చైతన్య ఒడ్డు పొడుగు లుక్ చూసి మెగా ఫ్యామిలీలో మరో హీరో జాయిన్ అయినట్టే అని భిమానులు పొంగి పోతున్నారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ సాయి తేజ్ వరుణ్ తేజ్ నీహారిక కళ్యాణ్ దేవ్ వైష్ణవ్ తేజ్ లతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ సినిమా కుటుంబం ఒక క్రికెట్ టీమ్ లా మారిన పరిస్థితులలో వీరందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా చిరంజీవి తన శక్తి మేరకు ప్రమోట్ చేస్తున్నాడు. 


ఇప్పడు ఈ లిస్టులో నిహారిక భర్త చైతన్య కూడ చేరిపోతే ఇతడిని కూడ ప్రమోట్ చేయవలసిన బాధ్యత చిరంజీవి పైనే ఉంటుంది అంటూ మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు నటించే సినిమాలు ఎక్కువైపోతున్న పరిస్థితులలో ఇక రానున్న రోజులలో ప్రతినెల ఎవరో ఒక మెగా ఫ్యామిలీ హీరో సినిమా విడుదల కాకుండా ఇండస్ట్రీ నడిచే రోజులు లేవనే అనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: