ఏ సిని పరిశ్రమ అయినా సరే ప్రేమకథలకు మంచి డిమాండ్ ఉంటుంది. క్రేజీ లవ్ స్టోరీస్ ఎన్నో తెలుగులో వచ్చాయి. కొన్ని ప్రేమకథలు ఎప్పతికి గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి వాటిలో స్నేహం, ప్రేమ కలిసి వచ్చిన సినిమాల్లో నువ్వే కావాలి కూడా ఎప్పటికి గుర్తుంటుంది. తరుణ్, రిచ జోడీగా విజయ భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా నువ్వే కావాలి. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో రామోజి రావు ఈ సినిమా నిర్మించారు. చిన్నప్పటి నుండి ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటూ మధ్యలో హీరోయిన్ కు ఒకతను పరిచయమై ఆమెను ప్రేమించడం.. చిన్నగా ఈ స్నేహితుల మధ్య దూరం పెరగడం.. దాన్ని తట్టుకోలేని వాళ్లు వాళ్ల స్నేహం ప్రేమగా మారిందని తెలుసుకోవడం.. దాన్ని చెప్పలేక సతమవడం నువ్వే కావాలి కథ యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

 

సినిమా తర్వాత స్నేహితులు ప్రేమికులుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. కథ్, కథనాలు అన్ని అద్భుతంగా కుదిరాయి. ఈ సినిమా సాంగ్స్ కూడా సినిమాకు చలా ప్లస్ అయ్యాయి. చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తరుణ్ హీరోగా చేసిన మొదటి సినిమా ఇది. తెలుగు సినిమా లవ్ స్టోరీస్ గురించి ప్రస్థావిస్తే మాత్రం నువ్వే కావాలి సినిమా కూడా వస్తుంది. అప్పటి యూత్ ఆడియెన్స్ ను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. 

 

సినిమా తర్వాత ఇలాంటి స్నేహం, ప్రేమ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. నువ్వే కావాలి సినిమా అప్పటికి ఇప్పటికి ప్రేక్షకులకు మంచి ప్రేమ కథా చిత్రంగా మిగిలింది. ఆ సినిమా టైం లో తరుణ్ లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే కథల విషయంలో సరైన ఎంపిక లేకపోవడంతో కెరియర్ లో వెనుకపడ్డాడు.             

మరింత సమాచారం తెలుసుకోండి: