సూపర్ హిట్ సినిమా ‘హృదయ కాలేయం’ దర్శకుడు మరియు హీరో పై జరిగిన దాడి గురించి బయటకు వస్తున్న విషయాలు అందర్నీ ఆశ్చర్య పరిచేవిగా ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు స్టీవెన్ శంకర్ ను ఒక తెలంగాణా ప్రాంత వీరాభిమాని ‘తెలంగాణకు చెందిన వాడిని హీరోగా పెట్టి కామెడి పేరుతో వ్యంగ్య చిత్రం తీస్తావా’ అంటూ విమర్శిస్తూ ఆ దర్శకుడి పై దాడికి దిగడం మంచిది కాదని హితవు పలుకుతూ చాలామంది తమ అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు.
‘సినిమా మంచి హిట్ అయ్యింది ఆ సినిమా వలన దర్శకుడితో పాటు సంపూర్ణేష్ బాబుకు కూడా మంచి పేరు వచ్చింది. అలాంటప్పుడు దర్శకుడిని అభినందించాల్సింది పోయి దాడి చేస్తారా?’ అంటూ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ సంఘటన పై తీవ్రంగా ప్రతిస్పందించారు రాష్ట్రము రెండు ముక్కలుగా విడిపోయినా తెలుగు వారందరూ ఒకటే అన్న బావన లేకుండా ఇలా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తే టాలీవుడ్ లో సినిమాలు నిర్మించలేని పరిస్థితి ఏర్పడుతుందని భరద్వాజా అభిప్రయా పడుతున్నారు.
దీనిని రాజకీయ పార్టీలు కూడ ఖండించాలని టాలీవుడ్ లోని అనేక మంది ప్రముఖులు కోరుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సీమాంధ్రకు చెందిన లక్షలాది ప్రజలతో పాటు అదే ప్రాంతానికి చెందిన సినిమా నటీనటుల పరిస్థితి ఏమిటీ అంటు భరద్వాజ ప్రశ్నిస్తున్నారు..
వివాదాలు ఎలా ఉన్నా ఊహించని సూపర్ హిట్ గా ‘హృదయ కాలేయం’ కలెక్షన్స్ దూసుకు పోతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: