ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా కెరీర్ పరంగా ఎన్నో గొప్ప విజయాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని ముందుకు సాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అనంతరం నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఇద్దరు హీరోలకు కూడా దాదాపుగా సమానమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. ఇక వీరిద్దరిలో ముందుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అవ్వగా, ఆ తరువాత రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 

IHG

ఇకపోతే మొత్తం కెరీర్ పరంగా ఈ ఇద్దరు హీరోలు ఇప్పటివరకు మూడు సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. ముందుగా 1999లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా జులై 15న, అలానే సూపర్ స్టార్ మహేష్ తొలి సినిమా రాజకుమారుడు జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి, కాగా వాటిలో తమ్ముడు హిట్ గా నిలవగా, రాజకుమారుడు అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుని ముందుకు దూసుకెళ్లింది. ఆ తరువాత 2000వ సంవత్సరం ఏప్రిల్ 14న మహేష్ రెండవ సినిమా యువరాజు, అలానే ఏప్రిల్ 20న పవన్ ఆరవ సినిమా బద్రి థియేటర్స్ లోకి వచ్చాయి. అయితే వాటిలో యువరాజు ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందుకోగా, బద్రి సూపర్ హిట్ కొట్టింది. అనంతరం 2006లో ముందుగా మహేష్ నటించిన పోకిరి ఏప్రిల్ 28న, అలానే పవన్ నటించిన బంగారం మే 3న రిలీజ్ అయ్యాయి. 

 

అయితే వాటిలో పోకిరి అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి సంచలనం సృష్టించగా, బంగారం సినిమా పెద్ద ఫ్లాప్ ని మూటగట్టుకుంది. ఈ విధంగా మొత్తంగా మూడు సార్లు కొద్దిపాటి గ్యాప్ తో ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా, రెండు సార్ల సూపర్ స్టార్ మహేష్, ఒకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైచేయి సాధించారు. అయితే 2001లో మాత్రం మహేష్ నటించిన మురారి ఫిబ్రవరి లో రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టగా, ఆంతరం ఏప్రిల్ లో పవన్ నటించిన ఖుషి రిలీజ్ అయి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ రెండు సినిమాల్లో పవన్ పైచేయిలో నిలిచినప్పటికీ, ఆ రెండు సినిమాల రిలీజ్ ల మధ్య రెండు నెలల వ్యత్యాసం ఉండడంతో వాటిని లెక్కించలేదు. ఇక 2006 తరువాత ఈ ఇద్దరూ మరొక్కసారి రిలీజ్ విషయంలో పోటీ పడలేదు. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలుస్తాయో లేదో, ఒకవేళ నిలిస్తే ఎవరు ఈసారి పైచేయిగా నిలిచి గెలుస్తారో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: