ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ సమంత. ఆ సినిమాతో హిట్ అందుకుని వరుస స్టార్స్ తో ఛాన్సులు అందుకుంది అమ్మడు. అతి తక్కువ కాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్ గానే కాదు అక్కినేని కోడలిగా కూడా సమంత పాపులారిటీ డబుల్ అయ్యింది. ఆఫ్టర్ మ్యారేజ్ మాములుగా అయితే హీరోయిన్స్ కు పెద్దగా డిమాండ్ ఉండదు కాని సమంత మాత్రం పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేస్తూ చెలరేగిపోతుంది. అయితే పెళ్ళయింది కాబట్టి సెలెక్టెడ్ సినిమాలనే చేస్తూ వస్తున్న ఈ అమ్మడు లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో హిట్ అందుకోగా ఈ ఇయర్ జాను సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.  

 

కంటెంట్ ఉన్న సినిమాల్లో తన పాత్ర ప్రాధాంతను బట్టి సమంత సినిమాలు సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రస్తుతం సినిమాలనే కాదు వెబ్ సీరీస్ లకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మెన్ సెకండ్ సీజన్ లో సమంత నటిస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో సమంత నెగటివ్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన సామ్ నెగటివ్ రోల్ లో అంటే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టమే. అయితే హిందీలో కాబట్టే సమంత నెగటివ్ రోల్ కు ఒప్పుకుందని అంటున్నారు.  

 

తెలుగు, తమిళ భాషల్లో సమంత ఆమెను నెగటివ్ రోల్ లో చూడటానికి ఇష్టపడరు కాబట్టి సమంత కేవలం హిందీలో కాబట్టే సమంత ఆ వెబ్ సీరీస్ కు ఒప్పుకుందని చెబుతున్నారు. ఇక ఎలాగు అక్కడ వెబ్ సీరీస్ చేస్తుంది కాబట్టి తెలుగులో కూడా వెబ్ సీరీస్ లు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి సమంత తెలుగులో వెబ్ సీరీస్ చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: