ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో చిన్న సినిమాల సమస్య తీరుతోంది. నిర్మాతలకు ఊరట కలుగుతోంది. లో-బడ్జెట్ సినిమాలకు ఒక వరం అని ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఈ బంగారు బాతుని కొందరు మిస్ యూజ్ చేస్తున్నారని. ఓటీటీ మాటున బూతు సినిమాల వ్యాపారం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

 

లాక్ డౌన్ తో థియేటర్లు మూత బడ్డాక ఓటీటీ మార్కెట్ పెరిగిపోయింది. అప్పులు తెచ్చి సినిమాలు తీసిన నిర్మాతలు ఆ వడ్డీల భారం మోయలేక. డైరెక్ట్ ఓటీటీకి వెళ్లారు. తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. దీంతో చిన్న సినిమాలకు మంచి సోర్స్ దొరికిందనే కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ ఆపర్చ్యునిటీని కొంతమంది మేకర్స్ దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

 

కరోనా కాలంలో ఓటీటీ బిగ్గెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ ప్లాట్ ఫామ్ గా మారిపోయింది. యూత్ అయితే వెబ్ సిరీసులు, వరల్డ్ సినిమాతో టైమ్ పాస్ చేస్తున్నారు. స్టే హోమ్ అనే మాటను స్టే విత్ ఓటీటీగా మార్చేశారు. స్మార్ట్ ఫోన్ లు, స్మార్ట్ టీవీలకు కనెక్ట్ అయిపోయారు. ఈ కనెక్షన్ ను క్యాష్ చేసుకునేందుకు పోటీపడుతున్నారు నిర్మాతలు. యూత్ ని ఈజీగా అట్రాక్ట్ చేసే హింస, అడల్ట్ కంటెంట్ ని కథల్లో నింపేస్తున్నారు. 

 

కొంతమంది మేకర్స్ అయితే కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా వెబ్ కంటెంట్ ని రూపొందిస్తున్నారు. థియేటర్ రిలీజ్ కు అస్సలు సాధ్యం కాని విజువల్స్ ని కూడా ప్రేక్షకుల ఫోన్ లో నింపేస్తున్నారు. వాళ్ల మైండ్ సెట్ తో బిజినెస్ లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాపారం చేయడంలో చాలామంది రామ్ గోపాల్ వర్మని ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ పెద్దలు కూడా కామెంట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: