మహేశ్ మాదిరి బన్నీ నిర్మాతగా మారకపోయినా.. తన ప్రతి సినిమాకు స్లీపింగ్ పార్టనరే. తన తండ్రి స్థాపించిన గీతా ఆర్ట్స్ లో నటిస్తూ.. రెమ్యునరేషన్ కింద వాటాలు తీసుకుంటున్నాడు. తాజాగా.. ఫ్రెండ్స్ ను నిర్మాతలుగా పరిచయం చేస్తూ.. లాభాలు పంచుకునే ప్లాన్ చేశాడు. బన్నీతో మూవీ తీస్తున్న కొరటాలదీ ఇదే పరిస్థితి. ఫ్రెండ్ ను నిర్మాతగా చేసి.. పార్టనర్ గా మారాడు కొరటాల.


బన్నీ రెమ్యునరేషన్ 15.. 20కోట్ల మధ్యలో ఉండేది. అల వైకుంఠపురం తర్వాత రెమ్యునరేషన్ పెంచాడు. కొరటాల సినిమాకు 10నుంచి 15కోట్లు తీసుకుంటాడని టాక్. అదే నిర్మాణంలో భాగస్వామ్యం అయితే.. రెమ్యునరేషన్ డబుల్ వస్తోంది. తమ్ముడు, స్నేహితులు పెట్టిన యువి క్రియేషన్స్ బేనర్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నాడు ప్రభాస్. ఇదే దారిలో స్నేహితులను ముందు ఉంచి వెనకాల కనిపించని నిర్మాతగా మారాడు బన్నీ.


బన్నీ, కొరటాల కాంబినేషన్ లో సినిమా గురించి వస్తున్న వార్తలను నిజం చేశారు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను శుక్రవారం ప్రకటించారు. ఈ సినిమాతో కొరటాల స్నేహితుడు, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ మిక్కిలినేని.. యువ సుధ ఆర్ట్స్ స్థాపించి నిర్మాతగా మారాడు. గీతా ఆర్ట్స్ 2 మరో నిర్మాణ సంస్థ కాగా.. బన్నీ స్నేహితుడు శాండి, స్వాతి, నట్టి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇలా స్నేహితులకు సినిమాలో వాటాలు ఇస్తూ.. బన్నీ, కొరటాల తమ వాటాలు పెంచుకున్నారు.


బన్నీ, కొరటాల సినిమా ప్రకటనతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులు ఊరు చివర నడి ఒడ్డున నిలబడినట్టు ఉన్న స్టిల్ ఆసక్తికరంగా మారింది. బన్నీ ఇందులో విద్యార్థి నాయకుడిగా.. యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించే పాత్రను పోషిస్తున్నాడట. భరత్ అనే నేను తర్వాత కొరటాల తీస్తున్న ఈ పొలిటికల్ మూవీలో ఎలాంటి మెసేజ్ ఇస్తాడో చూడాలి. అల్లు అర్జున్ 20వ సినిమా పుష్ప అయితే.. 21వ మూవీకి కొరటాల దర్శకుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: