ఆ తర్వాత అనుపమ తెలుగులో చేసిన నాలుగు సినిమాలు వర్క్ అవుట్ కాలేదు. లాస్ట్ ఇయర్ రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న అనుపమ తెలుగులో ఒకటి రెండు ఛాన్సులు చేతి వరకు వచ్చి మిస్ అయ్యాయి. రాం చరణ్ రంగస్థలం సినిమాలో సమంత పాత్రలో ముందు అనుపమని అనుకున్నాడు సుకుమార్. కాని ఫోటో షూట్ లో ఆమె వర్క్ అవుట్ అవదని తెలిసి ఆమె ప్లేస్ లో సమంతని ఫిక్స్ చేశారు.
ఇక లేటెస్ట్ గా నిఖిల్ హీరోగా చేస్తిన్న 18 పేజెస్ సినిమాలో కూడా ముందు అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా అనుకున్నారు. క్రేజీ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాతో అమ్మడు మళ్ళీ ఫాం లోకి వస్తుందని అనుకున్నారు కాని ఆమె ఆ ఛాన్స్ కూడా మిస్సైందని తెలుస్తుంది. 18 పేజెస్ లో అనుపమ బదులుగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ కు ఛాన్స్ ఇచ్చారట.
తనంతట తాను కాదంటుందో లేక వాళ్ళకి నచ్చక తీసేస్తున్నారో కాని అనుపమ విషయంలో మాత్రం ఏదో జరుగుతుంది. అమ్మడు కెరియర్ సరైన ప్లానింగ్ తో లేదన్నది మాత్రం అర్ధమవుతుంది. మరి కరెక్ట్ సినిమా పడితే సత్తా చాటాలని అనుకుంటున్న అమ్మడు ఆ సినిమాను ఎంపిక చేసుకోవడంలో తన టాలెంట్ చూపించాల్సిన అవసరం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి