నాచురల్ స్టార్
నాని ఏ
హీరోయిన్ తో చేసినా... వారంతా ఆటోమేటిక్ గా స్టార్
హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతారనే నమ్మకం టాలీవుడ్లో ఉంది.. ఈ హీరోతో జత కడితే చాలు లక్ దానంతట అదే వరిస్తుందని
నాని సినిమాలు నిరూపిస్తున్నాయి....
నివేదా థామస్ నిన్ను కోరి....!! అంటూ ఏకంగా మూడు సార్లు
నాని సినిమాలలో
హీరోయిన్ గా చేసింది .... మొదట్లో జెంటిల్ మాన్, తరువాత
నిన్ను కోరి, ఇప్పుడేమో "వి".
.
ప్రస్తుతం
నాని,
సుధీర్ బాబు కాంబోలో వచ్చిన "వి"
సినిమా అమెజాన్ ప్రైమ్ లో రావడానికి సిద్ధంగా ఉండగా... తనపై వస్తున్న ఓ వార్తకు క్లారిటీ ఇచ్చాడు నాని.. ప్రస్తుతం
టాలీవుడ్ లో పాన్
ఇండియా సినిమాల హవా నడుస్తోంది.
నాని "వి"
సినిమా తన కెరియర్లో 25 ప్రాజెక్ట్ అయినందున ... ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా
నాని ఏమైనా
బాలీవుడ్ బాట పడతారేమో అని టాక్ వస్తోంది... విభిన్న నటన తో
టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న
నాని కి ఆ సత్తా ఉంది అంటూ తమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
అయితే అలాంటి ఆలోచన లేదని "వి"
సినిమా ప్రమోషన్ సందర్బంగా క్లారిటీ ఇచ్చాడు మన నేచురల్ స్టార్.... నాకు
టాలీవుడ్ లో పూర్తి సంతృప్తి ఉంది... అంటూ తనకు తెలుగు ప్రేక్షకుల పై ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్నారు
హీరో నాని. ఇప్పటికి సరే..!! మరి భవిష్యత్తులో
నాని కి పాన్
ఇండియా హీరోగా అవకాశం వస్తే ఏం చేస్తారన్నది..? ఆసక్తికరంగా మారింది.. ఏదేమైనా
నాని పాన్ఇండియా
హీరో గా మారి మరో మెట్టు ఎక్కితే మాకు ఆనందమే అంటున్నారు... ఆయన అభిమానులు. మరో రెండు రోజుల్లో ఓటీటీ వేదికపై విడుదల కాబోతున్న "వి" చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు.... అందులోనూ మల్టీ స్టార్
మూవీ అయినందున మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇక ఈ
సినిమా హీరో నాని కి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టనుందో వేచి చూడాలి.