టాలీవుడ్ స్టార్లంతా ఎప్పుడెప్పుడు షూటింగ్ లు స్టార్ట్ అవుతాయా.. ఎప్పుడెప్పుడు సెట్స్ కి వెళ్దామా అని ఆలోచిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం తర్వాత ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు. ‘ట్రిపుల్ ఆర్’తర్వాత ఎవరితో సినిమా చేయాలనే విషయంలో అయోమయానికి గురవుతున్నాడు. తెలుగు దర్శకులతో సినిమా చేయాలా లేక తమిళ దర్శకుడితో కలిసి సెట్స్ కు వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు చరణ్.
రామ్ చరణ్ ‘ట్రిపుల్ ఆర్’తర్వాత భారీ సినిమా చేయాలనుకుంటున్నాడు. ‘ట్రిపుల్ ఆర్’క్రేజ్ ని క్యారీ చేసే కథల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక మెగాపవర్ స్టార్ ప్లాన్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి ముగ్గురు దర్శకులు లైన్ లో ఉన్నారట. వంశీ పైడిపల్లి చరణ్ కోసం ఓ కథ రాశాడని, ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ వంగా కూడా చెర్రీని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడని చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఇద్దరితో ఇప్పుడు తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూడా చరణ్ కోసం బయల్దేరాడని టాక్ వస్తోంది.
లోకేశ్ కనగరాజ్ మైత్రీ మూవీస్ లో ఒక సినిమాకి సైన్ చేశాడు. ఇక లోకేశ్ ఈ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మహేశ్ బాబుతో గానీ, రామ్ చరణ్ తో గానీ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే మైత్రీ మూవీస్ లోకేశ్ ని చరణ్ కోసం లాక్ చేసిందనే టాక్ వస్తోంది. దీంతో ఈ ముగ్గురిలో ముందు ఎవరిని ఓకే చేయాలి. ‘ట్రిపుల్ ఆర్’తర్వాత ఎలాంటి సినిమా చేస్తే బాగుటుందో అనే దానిపై ఆలోచిస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నాడట చరణ్. మొత్తానికి రామ్ చరణ్ అయోమయంలో పడ్డాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన మూడు ఏ వైపు మళ్లుతుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి