ఆ తర్వాత నుండి వరుసగా అవకాశాలతో కొనసాగిన చరణ్ తన ఆకట్టుకునే నటనతో ఎందరో ప్రేక్షకాభిమానుల గుండెల్లో మంచి స్థానాన్ని, పేరుని దక్కించుకున్నారు. అయితే రామ్ చరణ్ కెరీర్ లో 2013లో వచ్చిన తుఫాన్ సినిమా మాత్రం ఆయనను కొంత వరకు ఇబ్బందుల్లోకి నెట్టింది అనే చెప్పాలి. కాగా తొలిసారిగా చరణ్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిందీలో జంజీర్ పేరుతో తెరకెక్కి భారీ డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు తెలుగులో తుఫాన్ పేరుతో కూడా రిలీజ్ అయిన సినిమా ఫ్లాప్ కావడం జరిగింది. ఎన్నో ఆశలతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన చరణ్ కు జంజీర్ తీవ్ర నిరాశని మిగిల్చింది అని చెప్పాలి. అపూర్వ లఖియా దర్శకత్వంలో ఎంతో గ్రాండ్ లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాని ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి భారీ ఖర్చుతో నిర్మించాయి.కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఏసిపి విజయ్ ఖన్నా పాత్రలో నటించగా, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చరణ్ కు జోడీగా నటించింది. కాగా ఈ సినిమా లో విలన్ గా ప్రకాష్ రాజ్ నటించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా భారీ పరాజయాన్ని మూట కట్టుకోవడంతో ఆపై హిందీలో సినిమాలు చేయడానికి చరణ్ ఆసక్తి చూపలేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఖచ్చితంగా తనకు పాన్ ఇండియా హీరోగా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్న చరణ్ దాని అనంతరం ఇకపై బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి