100 సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు ప్రస్తుత తరం అభిరుచునలను అంచనా వేయడంలో వెనకడుగు వేస్తున్న పరిస్థితులలో నేటితరం దర్శకులతో సమానంగా సినిమాలు తీయలేకపోతున్నాడు. అయినప్పటికీ రీ సెంట్ గా ‘పెళ్ళి సందడి’ సినిమా టైటిల్ తో మరొక సాహసాన్ని శ్రీకాంత్ కొడుకును హీరోగా పెట్టి మూవీ తీయబోతున్నాడు.


ఈమూవీ ఇంకా సెట్స్ పైకి రాకుండానే ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. మౌన మునిగా పేరు పొందిన రాఘవేంద్రరావు తాను హోస్ట్ చేసిన సౌందర్య లహరి కార్యక్రమంతో మాట్లాడటం మొదలు పెడితే ఇప్పుడు ఏకంగా రాఘవేంద్రరావు ఒక మూవీకి హీరోగా మారబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఒక యంగ్ డైరెక్టర్ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మాణంలో నిర్మించబోయే మూవీలో రాఘవేంద్రరావు హీరోగా కనిపిస్తాడట. 78 సంవత్సరాల వయసులో ఉన్న ఈ దర్శకుడు హీరో అవ్వడం ఒక ఆశ్చర్యం అయితే అతడి పక్కన ముగ్గురు టాప్ హీరోయిన్స్ నటించబోతున్నట్లు టాక్.రమ్య కృష్ణ శ్రియ త్రిష లు కీలక పాత్రలలో నటించే ఈ మూవీ అంతా రాఘవేంద్రరావు చుట్టూ తిరుగుతుందని సమాచారం.


భార్య చనిపోయి పిల్లలకు దూరంగా ఉండే ఒక వృద్ధ పాత్రలో కనిపించే రాఘవేంద్రరావు తన ఆలోచనలు అలవాట్లలో మాత్రం యువకుడుగా కనిపిస్తూ ఉంటాడట. ఇతడిని ఆట పట్టించడానికి రాఘవేంద్రరావు జీవితంలోకి ఎంటర్ అయిన పెళ్ళి కాని మధ్యవయసులో ఉన్న పాత్రలలో రమ్యకృష్ణ త్రిష శ్రియ లు నటిస్తారని లీకులు వస్తున్నాయి. పూర్తి హాస్య సన్నివేశాలతో నేటితరం ప్రేక్షకులు మెచ్చే స్టోరీ లైన్ తో నిర్మాణం జరుపుకోబోయే ఈమూవీలో రాఘవేంద్రరావు చాల డిఫరెంట్ గా కనోపిస్తాడని టాక్. పైకి నవ్వుతూ కనిపించే రాఘవేంద్రరావు పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈసినిమాకు సంబంధించిన అధికారికక ప్రకటన త్వరలోనే ఉండబోతున్నట్లు వస్తున్న లీకులు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: