ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..
కరోనా వైరస్ కష్టకాలంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడిన ఎందరినో ఆదుకొని రియల్
హీరో అనిపించుకున్నాడు సోనుసూద్. అతడు చేస్తోన్న సేవలతో దేశం మొత్తం అతడిని పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఎవరు సహాయం అడిగినా.. కాదనకుండా చేసి పెడుతున్నాడు సోను. సోషల్ మీడియాలో స్టార్ హీరోలకు కూడా లేని క్రేజ్ సోను దక్కించుకున్నాడు. జనాల్లో అతడికి పెరిగిన ఫాలోయింగ్ చూసిన మేకర్స్ తమ సినిమాల్లో సోనుకి ఛాన్స్ ఇస్తున్నారు. తెలుగు దర్శకులు కూడా సోనుని సంప్రదిస్తున్నారు. గతంలో విలన్ వేషాలు వేసి
టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యాడు.

అయితే ఈ మధ్యకాలంలో అతడికి ఇక్కడ అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు మరోసారి సోనుని తీసుకురావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం సోనూసూద్..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. దర్శకుడు
బోయపాటి శ్రీను..
బాలయ్య హీరోగా తను రూపొందిస్తోన్న సినిమాలో సోనుని తీసుకోవాలని భావించాడు. ముందుగా ఈ పాత్ర కోసం
సంజయ్ దత్ ని అనుకున్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సోనుసూద్ ని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఈ విషయమై సోనుని సంప్రదించగా.. ఆయన అడిగిన రెమ్యునరేషన్ కి షాకయ్యారట మేకర్లు.

ఇప్పటివరకు సోనుకి ఒక్కో సినిమాకి
కోటి నుండి కోటిన్నర రెమ్యునరేషన్ ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన రూ.4 కోట్లు అడిగినట్లు సమాచారం. దీంతో
బోయపాటి టీమ్ సైలెంట్ గా వెనక్కి వచ్చేసిందట. మరో నిర్మాతకు కూడా ఇదే రేటు చెప్పడంతో సోను తన రెమ్యునరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. మొత్తానికి సోనుసూద్ సినిమాల ద్వారా సంపాదించి దానిని జనాలకు పంచాలని అనుకుంటున్నాడేమో! ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...