తెలుగులో ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం నాలుగో సీజన్ జరుగుతోంది. కోవిడ్ పరిస్థితుల మధ్య అత్యంత కట్టుదిట్టంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. నాగార్జున హోస్ట్ గా మూడో సీజన్ ను రక్తి కట్టించిన నాగార్జునే నాలుగో సీజన్ ను కూడా నడిపిస్తున్నాడు. బిగ్ బాస్ కు నాగార్జున హైలైట్ అనేది అందరూ ఒప్పుకునే మాట. అయితే.. గత మూడు సీజన్లకు భిన్నంగా ఈసారి కొంచెం విమర్శలు ఎదుర్కొంటోంది.

బిగ్ బాస్ కు ఎంత ఆదరణ ఉన్నా ఈసారి టీఆర్పీ రేటింగ్స్ లో అంతగా ప్రభావం చూపలేకపోతోంది. ఇందుకు పలు కారణాలు చెప్తున్నారు. అందరూ దాదాపు కొత్తవాళ్లనే తీసుకున్నారని షో ప్రారంభం నుంచీ అంటున్నారు. అయితే.. వారం మొత్తం కంటెస్టెంట్ల గేమ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా వీకెండ్ లో నాగార్జున వచ్చే రెండు రోజులు కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతోంది. అయినా.. 5కి మించి రేటింగ్స్ రావడంలేదని తెలుస్తోంది. గత వారం విజయదశమి సందర్భంగా స్పెషల్ అప్పీయరెన్స్ గా స్టార్ హీరోయిన్ సమంతను హోస్ట్ గా తీసుకొచ్చారు. సమంత వచ్చినా.. దసరా పండగ అయినా రేటింగ్స్ 7.5 మాత్రమే వచ్చాయని సమాచారం.

ఈసారి రేటింగ్స్ తో నాగార్జున ఆగ్రహంగా ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు సమంత వచ్చినా.. పండగ సందడి ఉండి కూడా 10పైనే రేటింగ్ రాకపోవడం బిగ్ బాస్ యాజమాన్యాన్నే ఆశ్చర్యపరుస్తోందని అంటున్నారు. ఇందుకు కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రోగ్రామింగ్ లో ఏమన్నా ఇంట్రెస్ట్ కల్పించట్లేదా అనేది ఆలోచిస్తున్నారట. అయితే.. బాగా ఆడుతున్న వారు ఎలిమినేట్ కావడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ కూడా ఒక కారణమనే వాదన లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: