లఘు చిత్రాలలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టాడు రాజ్ తరుణ్. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుని  తెలుగు ప్రేక్షకులందరూ చూపును తనవైపు ఆకర్షించారు. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతు మంచి క్రేజ్ సంపాదించాడు రాజ్ తరుణ్. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత మాత్రం అంతగా తెలుగు ప్రేక్షకులను అలరించ లేక పోయాడు. ఎన్నో భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ యువహీరోను ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు.



 వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ సరైన హిట్ మాత్రం కొట్ట లేకపోతున్నాడు. ఇలా క్రమక్రమంగా హిట్ కు ఎంతో దూరం అయిపోయాడు రాజ్ తరుణ్. అయితే సరైన హిట్టు పడక పోయినప్పటికీ రాజ్ తరుణ్ మాత్రం వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ఉండటం గమనార్హం. ఇటీవల ఒరేయ్ బుజ్జి గా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్... ఇక ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో రాజ్ తరుణ్ కెరియర్ కాస్త అయోమయంలో పడిపోయింది అయినప్పటికీ మరో కొత్త సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజ్ తరుణ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.


 ఇటీవల హీరో రాజ్ తరుణ్ మరో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాడు. శాంటో  దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను నందకుమార్ భరత్ నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. రాజ్ తరుణ్ 15వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటూ దర్శకుడు చెబుతున్నాడు. మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ కి హిట్ అందిస్తుందో లేదో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: