ఈ ఫోటో గురించి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ పై కూడ పవన్ అభిమానుల మధ్య అనేక ఆసక్తికర చర్చలకు తావిచ్చింది. అకిరా నందన్ ఆధ్యలు పవన్ గుండెలను హత్తుకుని నిద్రిస్తూ ఉంటే వారిద్దరినీ తన చేతులతో హత్తుకుంటూ పవన్ ఏదో ఆలోచనలలో పడ్డాడు.
ఈ ఫోటోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘కొన్ని అందమైన ఫోటోలను జ్ఞాపకాలను అందరితో పంచుకోవాలి. అలాంటి ఫోటోలను సెల్ ఫోన్ ఫోటో ఆల్బమ్ లో పెట్టుకోవడానికి కాదు’ అంటూ భావయుక్తంగా కామెంట్స్ చేసింది. దీనితో రేణు ఈ ఫోటో పై చేసిన కామెంట్స్ లోని ఆంతర్యం ఏమిటి అంటూ అనేక ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.
ఈమధ్య పవన్ అకిరా నందన్ ఆద్యలు కలిసిన సందర్భాలు లేవు. దీనికితోడు పవన్ ఈ సంవత్సరం అంతా లాక్ డౌన్ పిరియడ్ లో చాతుర్మాస దీక్షలోను ఆతరువాత సినిమా షూటింగ్ లలోను ఈమధ్య మళ్ళీ రాజకీయాలలోనూ పవన్ చాల బిజీగా ఉంటున్నాడు. దీనితో పవన్ కు అకిరా ఆద్య లపై ఉన్న ప్రేమను బాధ్యతలను గుర్తుకు చేయడానికి రేణు దేశాయ్ ఇలా వ్యూహాత్మకంగా ఒకప్పటి ఫోటోను ఇప్పుడు షేర్ చేసి పవన్ కు అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేసింది అనుకోవాలి. రేణు దేశాయ్ ఉద్దేశ్యం ఏమైనప్పటికీ పవన్ అకిరా ఆద్య లతో కలిసి ఉన్న ఆఫోటో ను చూసి పవన్ అభిమానులు మాత్రం తెగ సంబరపడ్డారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి