ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో పుట్టి పెరిగిన భారత సంతతి ముద్దుగుమ్మ విమలారామన్ మోడలింగ్ రంగంలో అరంగేట్రం చేసి భారతీయ
సినిమా రంగంలో అడుగు పెట్టి యాక్ట్రెస్ గా తనదైన ముద్ర వేశారు. ఎవరైనా ఎప్పుడైనా(2009), గాయం-2(2010) చిత్రాల్లో
హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన విమలారామన్ ఆ తర్వాత కూడా రంగా ది
దొంగ, చుక్కలాంటి
అమ్మాయి వంటి తదితర సినిమాల్లో నటించారు. ఆమె నటించిన పలు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో
హీరోయిన్ అవకాశాలు ఒక్కసారిగా తగ్గి పోయాయి. దీనితో ఐటెం సాంగులో నటించే అవకాశాలను వచ్చినా.. ఆమె వదులుకోలేదు. నువ్వా నేనా
సినిమా లో ఆమె ఒక ఐటం సాంగ్ లో కనిపించి కుర్రకారుకి సెగలు పుట్టించారు.

తదనంతరం ఓం నమో వెంకటేశాయ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా తెరమరుగయ్యారు. సాధారణంగా విమలారామన్ ప్రాధాన్యత కలిగిన పాత్రలను పోషించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కథానాయిక అయినా..
కథానాయకి అయినా ఆ పాత్రకు విలువ ఉంటేనే ఆమె చేయడానికి సిద్ధం అవుతారు. అందుకే చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ ఆమె ఇప్పటివరకు ప్రేక్షకులకు గుర్తున్నారు.

అయితే తాజాగా సోషల్
మీడియా వేదికగా దర్శనమిచ్చిన విమలారామన్ నెటిజనులకు, అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఎందుకంటే తాను షేర్ చేసిన సరికొత్త ఫోటోలలో ఆమె చక్కని చుక్కలా కనిపిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆమె ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. దీనితో చాలా బాగున్నావు అంటూ నెటిజన్లు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు. సోషల్
మీడియా వేదికగా ఆమె ఫోటోలు కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా బాగా కష్టపడి చాలా ఆకర్షణీయంగా మారిన విమలారామన్ కి
సినిమా అవకాశాలు రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.