ఈ మధ్యకాలంలో బాలీవుడ్ చూపు తెలుగు సినిమాల రీమేక్స్ పై పడిందనే చెప్పుకోవాలి. చాలావరకు తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ మూవీ మేకర్స్ మొగ్గు చూపుతున్నారు. వారు మన తెలుగు సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ కే రీమేక్ ను కూడా డైరెక్ట్ చేసే అవకాశాన్ని కలిగిస్తున్నారు. ఇది నిజంగా అభినందించదగ్గ పరిణామం. ఈ కోవలోకే అనుష్క నటించిన "భాగమతి" మూవీ కూడా చేరింది. బాలీవుడ్ లో ఈ సినిమా "దుర్గామతి"గా రీమేకైంది. 

"డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే" తరువాత యాక్ట్రస్ భూమి పెడ్నేకర్ ఎమెజాన్ ప్రైమ్ వీడియో ఫిలిం "దుర్గామతి"లో లీడ్ రోల్లో కనిపించింది. ఇది తెలుగులో సూపర్ డూపర్ హిట్టైన హారర్ మూవీ "భాగమతి"కి రీమేక్. థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో భూమి పెడ్నేకర్ అనుష్క శెట్టి పాత్రలో నటించింది. సౌత్ బ్యూటీ అనుష్క బాలీవుడ్ బ్యూటీ భూమికి మద్దతుగా నిలిచింది. భూమి పెడ్నేకర్ కు అలాగే టీంకు బెస్ట్ విషెస్ తెలిపింది. ఈ సినిమా ప్రీమియర్ అవుతున్న సందర్భంగా అనుష్కసినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పింది. "దుర్గామతి" సినిమాను కూడా భాగమతిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అశోక్ తెరకెక్కించాడు. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రీమియర్ అవుతోంది. 

ఒకానొక ఇంటర్వ్యూలో "దుర్గామతి" సినిమా హీరోయిన్ ఈ సినిమాలో తన పాత్ర గురించి అలాగే సినిమా స్టోరీ గురించి కొన్ని విషయాలను బాలీవుడ్ మీడియాతో పంచుకుంది. ఈ సినిమాలోని తన రోల్ గురించి భూమి ఎంతో ఎక్సయిటెడ్ గా ఉంది. ఈ సినిమాను అనుష్క శెట్టి ఫ్యాన్స్ కూడా చూసి ఆదరిస్తారని భూమి ఆశిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకు హీరోయిజం ఎక్కువగా ఉంటుందని, ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు అరుదుగా వస్తాయని, ఇటువంటి మూవీలో తనకు ఇంత మంచి రోల్ దక్కడం తన అదృష్టమని భూమి చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: