కొంతమంది హీరోయిన్లు కేవలం అందానికే పరిమితమవుతారు.అలాంటి వారు చదువులో కాస్త వెనకబడి ఉంటారని మనందరి అపోహ. ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ దాగి ఉంటుంది. కానీ ప్రణీత మాత్రం అందంతో పాటు చదువుతో కూడా అందర్నీ ఆకర్షింపచేస్తోంది.
ప్రణీత సోషల్ మీడియాలో తన టెన్త్ మార్క్ షీట్ ను షేర్ చేయడంతో చూసినవారంతా ఔరా! అంటున్నారు. ప్రణీత అందం అభినయంతో పాటు చదువులో కూడా ముందుండేవారని తెలుస్తోంది. అయితే ప్రణీత తన టెన్త్ మార్క్ లిస్ట్ ను షేర్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సమంత ప్రణీత లు సంయుక్తంగా సోషల్ మీడియాలో వారివారి అకౌంట్లలో కొత్త ట్రెండ్ కు స్వాగతం పలికారు. ఇది ఒక
గేమ్ లాగా మొదలుపెట్టి అభిమానులకు ఆఫర్లు ఇచ్చారు. ఆ
గేమ్ ఏమిటంటే
సమంత ప్రణీతలు అభిమానులు ఎలాంటి ఫోటో అడిగిన షేర్ చేసే విధంగా ఆ
గేమ్ ఉంటుంది. ఇదే విషయమై వీరు సోషల్ మీడియాలో షేర్ చేయగా సమంతాను కొంతమంది తింటున్నప్పుడు, కోప్పడినప్పుడు,
మేకప్ లేకుండా, వంట చేస్తున్నప్పుడు, చైతు తో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి ఫోటోలను అడగగా ఆమె నిర్మొహమాటంగా అభిమానులకు షేర్ చేసింది.
ఇక ప్రణీతను కూడా ఇలాగే కొంతమంది అడిగి ఫోటోలను షేర్ చేసేలా చేశారు. కానీ ఒక అభిమాని మాత్రం ప్రణీతను మీ టెన్త్ మార్క్ షీట్ షేర్ చేయమని అడిగాడు. అయితే వెంటనే ఆమె తన టెన్త్ మార్క్ షీట్ ను షేర్ చేసింది. ఆ మార్క్ షీట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఆమె బెంగుళూరులో చదివినట్టు ఆ మార్క్ షీట్ ద్వారా తెలుస్తోంది. లెక్కల్లో 95%,ఇంగ్లీషులో 83%,కన్నడలో 90%, సైన్స్ లో 90 శాతం అలా స్కోర్ చేసింది.ఎంత పర్సంటేజ్ వచ్చినా కూడా అభిమానులతో ఏదో పర్లేదు వచ్చింది అంత సింపుల్ గా చెప్పేసింది. దీన్ని బట్టి చూస్తే ప్రణీతకు అందం అభినయంతో పాటు చదువు కూడా ఎక్కువే అని తెలుస్తోంది.