ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ బ్యానర్ లో నాగ వర్మ హీరోగా నటిస్తున్న సినిమా విక్రమ్. పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను హరిచందన్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను హీరోగా నటిస్తున్న నాగ వర్మ నిర్మిస్తుండటం విశేషం. దివ్యా రావు హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. సినిమా ప్రేక్షకులకు చేరువయ్యే మొదటి స్టెప్ మ్యూజిక్.. అందుకే విక్రమ్ సినిమా మొదటి పాటని స్టార్ మ్యూజిక్ డైరక్టర్ కోటితో రిలీజ్ చేయించారు.

విక్రమ్ సినిమాలో చుక్కలాంటి అమ్మాయి సాంగ్ ను సంగీత దర్శకులు కోటి రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సురేష్ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాలో సాంగ్స్ అన్ని విన్న కోటి చాలా బాగున్నాయని అన్నారు. సినిమా కథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు. యువతరం ఆలోచనా విధానానికి దగ్గరగా ఉండేలా సినిమా కథ ఉందని ఇలాంటి సినిమా చేస్తున్న నాగ వర్మ అభిరుచి ఏంటో అర్ధమవుతుందని కోటి అన్నారు.

ఈ సినిమాకు సంగీతం అందించిన సురేష్ ప్రసాద్ కోటి శిష్యుడే. అందుకే తన శిష్యుడు అందించిన సినిమా మ్యూజిక్ బాగుందని అన్నారు కోటి. అభిమాన సంగీత దర్శకులు కోటి గారి చేతుల మీదగా సాంగ్ రిలీజ్ చేయించడం ఆనందంగా ఉందని హీరో కమ్ ప్రొడ్యూసర్ నాగ వర్మ అన్నారు. రైటర్ ప్రేమలో పడితే.. సినిమాలే జీవితం అనుకున్న అతను ప్రేమించిన అమ్మాయికి ఎలా దూరమయ్యాడు అన్న కథతో సినిమా వస్తుంది. సినిమా రిలీజ్ త్వరలోనే ఉంటుందని అన్నారు చిత్రయూనిట్. లవ్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా విక్రమ్. రైటర్ లవ్ స్టోరీగా సినిమా వస్తుంది. కచ్చితంగా ప్రేమకథా చిత్రాల్లో భిన్నంగా ఉంటుందని అంటున్నారు దర్శకుడు హరిచందన్.

మరింత సమాచారం తెలుసుకోండి: