సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయస్తుడే.. వందల కొద్దీ పాటలు పాటలతో ప్రేక్షకులను అలరించిన రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.. సీజన్ 3 విజేత కూడా నిలిచి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు. తన వ్యక్తిత్వానికి ముచ్చటపడ్డ ప్రేక్షకులు రాహుల్ ని విజేతగా నిలిపారు. అయితే రాహుల్ గురించి చెప్పుకున్న ప్రతిసారి పునర్నవి గురించి ఖచ్చితంగా చెప్పాలి.. రాహుల్ గెలుపు లో ఆమె పాత్ర కూడా ఉంది.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు వీరిద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ నడిచింది అని చెప్పొచ్చు.

ఎక్కడ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అన్నంత బిల్డప్ క్రియేట్ అయ్యింది.. కానీ బయటకి వచ్చాక సీన్ వేరే గా ఉంది. రాహుల్ పునర్నవి ని కాకుండా మరో బిగ్ బాస్ పార్టిసిపెంట్ అషు రెడ్డి తో ఎక్కువగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈమధ్య ఈ తిరగడం ఎక్కువయిందని చెప్పొచ్చు.. దాంతో వీరిద్దరి మధ్య ఎదో జరుగుతుందని పుకార్లు మొదలయ్యాయి. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లడం, వీకెండ్ పార్టీలు, డేట్‌లకు తిరుగుతూ రచ్చ చేసేశారు. ఇక ఈ ఇద్దరి జంటను చూసిన అభిమానులు వింత వింత ప్రశ్నలు అడిగేవారు. ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకుంటున్నారా? అంటూ ప్రశ్నలు కురిపించేవారు.

ఇకపోతే రాహుల్ ఇప్పుడు ఓ బట్టల షాప్ ని పెట్టె ఆలోచనలో ఉన్నాడు. కరీంనగర్ లో ఓ బ్రాంచ్ ఓపెన్ చేయగా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేయాలనీ చూస్తున్నాడు. ఈ స్టార్ ఓపెనింగ్ కి అషూ రెడ్డి స్పెషల్ గెస్ట్‌గా రానుంది. అయితే  అషూ రెడ్డి స్పెషల్ గెస్ట్‌గా రాబోతోందంటూ చెబుతూ సస్పన్స్ క్రియేట్ చేయాలని చూశాడు. మొదటి ఫోటోలో అషూను అంత క్లియర్‌గా చూపించకుండా.. నా వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? రేపటి మన గెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అది అషూ రెడ్డి అని అందరికీ తెలిసిపోయింది. రాహుల్‌ మీద ఎక్కేసిన అషూ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య ఎంతటి సన్నిహిత సంబంధం ఉందో ఆ ఫోటోలను చూస్తేనే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: