ఈ క్రమంలోనే జబర్దస్త్ నుంచి ఇక ఆ తర్వాత ఎన్నో ఆఫర్లు కూడా అందుకుంది అనసూయ. జబర్దస్త్ తర్వాత వెండితెరపై కూడా అడుగు పెట్టి ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు రంగమ్మత్త గా మారిపోయింది. ఇక ఎప్పుడూ సరదా సరదాగా ఉండే అనసూయ ఎవరైనా తనపై బ్యాడ్ కామెంట్స్ చేసారూ అంటే చాలు శివంగి లా వార్నింగులు ఇస్తుంది అనే విషయం తెలిసిందే.
అయితే ఇటీవలే జబర్దస్త్ లో హైపర్ ఆదికి అనసూయ చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ వార్నింగ్ ఇచ్చింది సీరియస్గా కాదు ఫన్నీ గా ఈ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది అంటారా.. ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో హైపర్ ఆది టీం శంకర్ రోబో సినిమా స్పూఫ్ చేసింది. స్పూఫ్ లో రజినీకాంత్ లాగా హైపర్ ఆది నటించగా ఇక ఐశ్వర్య రాయి పాత్రలో అనసూయ నటిస్తోంది. ఈ క్రమంలోనే మీరు ఎప్పుడూ ఈ ల్యాబ్ లోనే ఉంటారు పెళ్ళాం పిల్లలు ఉన్నారని అసలు పట్టించుకోరు ఒక ముద్దుముచ్చట లేనేలేదు అని అనసూయ అనగానే రెండు చేతులు చాచి రా మరి అంటూ హైపర్ ఆది పంచ్ వేస్తాడు దీంతో అందరు నవ్వుకుంటారు. ఇక అంత లో కల్పించుకున్న అనసూయ ఆది క్యారెక్టర్ లో ఉండు అంటూ చెబుతుంది. ఇక ఆ తర్వాత మరో డైలాగ్ చెబుతుంటే రా మరి అంటూ హైపర్ ఆది అంటే నిన్ను చంపేస్తా ఆది అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది అనసూయా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి