
ఇండియాహెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "సింహ","లెజెండ్" పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇద్దరు కలిసి మూడో సినిమా చేస్తున్నారు..BB3 అంటూ ఘనంగా ప్రారంభించి, షూటింగ్ మొదలు పెట్టారు. అంతేనా ‘రోర్’ అంటూ ఓ చిన్న వీడియోను రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ‘BB హ్యాట్రిక్ పక్కా’ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ చేసేశారు. ఈ లోగా కరోనా వచ్చింది. సినిమా విడుదల ఆగిపోయింది. పరిస్థితులు కుదుటపడి, అన్ని సినిమాలు మొదలైనా ఈ సినిమా మొత్తం ఇంకా పట్టాలెక్కలేదు. ‘రేపు మాపు’ అని ప్రకటనలు కూడా ఏమీ లేవు. ఇటీవల అయితే మే 28న సినిమా విడుదల చేసేస్తాం అని డేట్ కూడా చెప్పేశారు. షూటింగ్ కూడా మొదలైందని తెలుస్తోంది.
అయితే అసలు విషయానికి వస్తే..ఇప్పుడు ఇంకో వార్త బయటికొచ్చింది. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పెంచడానికి ఇంకో హీరోయిన్‌ను పెట్టాలని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను సినిమా కోసం ఎంచుకున్నారు. ఇప్పుడు మూడో హీరోయిన్ వస్తోందన్నమాట. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న సినిమా పనులు రిలీజ్ డేట్ ప్రకటించడంతో మంచి స్పీడ్ అందుకున్నాయట. విడుదలకు గట్టిగా మూడు నెలలే ఉండటంతో దర్శకుడు జోరు పెంచారట. ఈ క్రమంలో సినిమాలోకి మూడో హీరోయిన్‌ను కూడా తీసుకుంటున్నారట. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఇంకా పెంచితే బాగుంటుందనే ఆలోచన రావడంతో మూడో హీరోయిన్ ఆలోచన వచ్చిందట.
అయితే ఇప్పటివరకు ఎంచుకున్న హీరోయిన్ల విషయంలోనే పెద్ద సెర్చ్ జరిగింది. వాళ్లు, వీళ్లు అనుకొని ఆఖరుకు ప్రగ్యా జైస్వాల్, పూర్ణను ఎంపిక చేశారు. ఇప్పుడు మూడో హీరోయిన్ కోసం ఇంకెంత సెర్చ్ జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో మరో స్టార్ హీరోయిన్‌ను పెడతారని వార్తలు వచ్చాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...