మరి ఈ పాప ఎవరో అనుకుంటున్నారా ఆమె తెలుగు స్టార్ హీరోయిన్ అనుపమ. మళయాళీ అయిన అనుపమ తన చేప కళ్లతో అందరిని మెస్మరైజ్ చేస్తోంది. ఇటీవల ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు లేకపోయినా ఒక్క ఛాన్స్ అయినా రాకపోదా ? అని ఆశతో వెయిట్ చేస్తున్నారు. ఇక అనుపమ చిన్నప్పటి పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అనుపమ కు తెలుగులో చివరిగా బెల్లంకొండ హీరోతో చేసిన రాక్షసుడు సినిమా మాత్రమే హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు ఇక్కడ ఒకటీ అరా ఛాన్సులు వచ్చినా వాటిని ఉపయోగించు కోలేకపోయింది. గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనుపమ కరోనా తర్వాత తన లైఫ్ స్టైల్ ను చాలా వరకు మార్చేశారు. ఈ టైంలోనే ఆమె స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫొటో ఇన్ స్టాలో పెట్టడంతో జోరుగా వైరల్ అవుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి