అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ పాస్టర్‌ తనను నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఓ పాస్టర్ చేతిలో వేధింపులకు గురైన మహిళకి సినీ నటి కరాటే కల్యాణి అండగా నిలిచారు. యువతి చేత పాస్టార్‌పై  మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..  తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఓ యువతి ఆల్కట్‌తోట సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి వచ్చేది. భార్యకు విడాకులిచ్చానని చెప్పి పాస్టర్‌ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఇంటికి పిలిచి నన్ను లైంగికంగా లోబరుచుకున్నాడు. ఆ సమయంలో వీడియో రికార్డు చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే కొద్ది రోజులుకు పెళ్లి గురించి అడగ్గా.. తనకు పిల్లలు ఉన్నారని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పారు.

అక్కడి పాస్టర్‌ ఎన్‌జే షరోన్‌ కుమార్‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడని బాధిత యువతి ఆరోపించారు. ఆ తర్వాత ముఖం చాటేశాడని, గట్టిగా నిలదీస్తే నగ్న వీడియోలు బయట పెడతానని.. బయటికి చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనకు తండ్రి లేడని, అందుకే భయపడి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు యువతి పేర్కొంది. ఈ క్రమంలో ప్రియాంక టాలీవుడ్ సినీ నటి కరాటే కల్యాణి సాయంతో పోలీసులను ఆశ్రయించింది.

దీనిపై కరాటే కల్యాణి స్పందిస్తూ, షారోన్ బెదిరింపులతో ప్రియాంక హైదరాబాదులో తలదాచుకుందని వెల్లడించారు. ప్రియాంకకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని తాము అండగా నిలిచామని వివరించారు. హైదరాబాదు షీ - టీమ్ పోలీసుల సూచన మేరకు రాజమండ్రిలో ఫిర్యాదు చేశామని తెలిపారు. పాస్టర్ షారోన్ ను కఠినంగా శిక్షించి యువతికి న్యాయం చేయాలని కరాటే కల్యాణి డిమాండ్ చేశారు. మతాలకు అతీతంగా తాము సాటి మహిళ కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: