తెలుగు చిత్ర పరిశ్రమలో  కొన్ని సినిమాల్లో నటించిన ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఈమె. చాలా సింపుల్ గా ఉండడం ఈమె నైజం. ఇక క్రీడల్లో రాణిస్తే ఇటు పేరు, అటు ఉద్యోగం కూడా వస్తాయని పలువురిని ఆమె వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈమె ఎవరో కాదు ఒకప్పుడు పరుగుల రాణిగా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన అశ్విని నాచప్ప.

కరోభయ్యా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు స్పోర్ట్స్ నుంచి తను రిటైర్ అయిన తర్వాత వాళ్ల భర్త నిర్వహించే ఒక స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన పనులన్నీ అశ్విని గారే చూసుకుంటున్నారు. అశ్విని కి ఇద్దరు పిల్లలు పెద్ద అమ్మాయిపేరు అనీష, చిన్న అమ్మాయి పేరు దీపాలి.ప్రస్తుతం అనీషా బ్యాడ్మింటన్ లో స్టేట్ లెవెల్ ప్లేయర్ గా ఆడుతూ గుర్తింపు పొందుతున్నారు.

ఎప్పటికైనా తన కూతుర్ని ఒక మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ ని చేసి తన వంతు సహాయంగా దేశానికి ఒక మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ నీ ఇవ్వడమే తన బాధ్యత అని అశ్విని చెబుతుంటారు. అలాగే చిన్నమ్మాయి దీపాలి కూడా ప్రస్తుతం గోల్ఫ్ ప్లేయర్ గా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపును సాధిస్తుంది. చాలా ఖరీదైన ఆటగా చెప్పుకునే గోల్ఫ్ ఆటలో తన ప్రతిభని చూపించడానికి దీపాలి ఎదురుచూస్తూ ఉంది.

ప్రస్తుతం అశ్వినీ నాచప్ప తన పిల్లలతో పాటు ఇంకో 32 మంది ఆడపిల్లలకు తర్ఫీదు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వాళ్ల పిల్లలనే కాకుండా ఇంకా కొంత మంది ఆడపిల్లలకి కూడా తనదైన శిక్షణతో ముందుకు నడిపిస్తుంది.ఆడపిల్లలకి తను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే బాగా చదువుకోవాలి చదువుతోపాటు ఆటలు కూడా బాగా ఆడాలి. అయితే అటు ఫిల్మ్ ఇండస్ట్రీ లోను, ఇటు స్పోర్ట్స్ లోనూ తనకు ప్రావీణ్యం ఉండడంవల్ల ఆడపిల్లలకి అక్కడ ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తనకి తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ని అధిగమించే విధంగా ఆడపిల్లల్లో కూడా క్రీడలు ఆడే చైతన్యాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో తన పిల్లలతో పాటు వేరే ఆడపిల్లలు కూడా శిక్షణనిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: