సినిమా ప్రపంచం అనేది ఒక మాయా ప్రపంచం. ఎవరు, ఎప్పుడు సినీ ఇండస్ట్రీ లోకి వస్తారో తెలియదు.. ఒకవేళ వచ్చినవాళ్లు ఎంతకాలం ఉంటారో కూడా తెలియదు.. కొంతమంది సినీ ఇండస్ట్రీకి పరిమితమైతే, మరి కొంతమంది ఒకటి - రెండు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మొదట్లో హీరోలు గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ కొట్టేసిన ఎంతో మంది నటులు,ఆ తరువాత ఏమైపోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక అదే కోవకు చెందిన వాడు వాన సినిమా హీరో..


పూర్తి వివరాల్లోకి వెళితే  2008లో వచ్చిన వాన సినిమాలో బెంగళూరు అబ్బాయి వినయ్ హీరోగా నటించాడు. వెరైటీ కథతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల  ప్రశంశలు అందుకుంది.. వినయ్ మొదట మోడల్గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. అంతేకాకుండా ఈ తమిళ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది.. తమిళ్ లో వినయ్ చేసిన నటనకు గాను తెలుగు లో వాన సినిమా తో అవకాశం దక్కించుకున్నాడు..


ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన వాన సినిమా, ఒక వెరైటీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో మంచి హిట్ టాక్ ను అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.. అయితే ఈ సినిమా ద్వారా వినయ్ కి కూడా మంచి పేరు వచ్చింది అని చెప్పవచ్చు.. వాన సినిమా ఎంత హిట్ టాక్ ఇచ్చినప్పటికీ, వినయ్ ని మాత్రం టాలీవుడ్ పట్టించుకోలేదు. కొద్ది సంవత్సరాల పాటు తెలుగులో అవకాశాలు వస్తాయని వేచి చూసినప్పటికీ, అవకాశాలు రాక పోవడంతో తమిళ సినీ రంగానికి వెళ్ళిపోయాడు.



ఇక అక్కడ కూడా వినయ్ కు నిరాసే మిగిలింది. వినయ్ నటించిన సినిమాలు హిట్ అయినప్పటికీ, అవకాశాలు మాత్రం వచ్చేవి కావు . మరికొన్ని సినిమాలు ఏమో కొద్దిరోజులు షూటింగ్ జరుపుకొని, మధ్యలోనే ఆగిపోయే కూడా.. దాంతో వినయ్ పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాలనుకున్నా డు.. కానీ ఏవో కారణాల చేత   ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: