గానగంధర్వుడు గా పేరు తెచ్చుకున్నగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు. గాయకుడిగా ఎంతో రాణించిన ఘంటసాల, కొన్ని నియమాలు పాటించడంలో అంతకంటే గొప్పగా రాణించారు. ఘంటసాల గానం చేసిన భగవద్గీత తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలచి ఉంటుంది. ఈ భగవద్గీత ను గానం చేసే సమయంలో ‘దొరబాబు’ సినిమాకు ఘంటసాల పాటలు పాడల్సి వచ్చింది. అయితే ఆ సినిమాలో పాటలు పాడిన తరువాత ఘంటసాల ఎంతో బాధపడ్డారట. భగవద్గీత పాడిన తరువాత ఆ నోటితో ఇక సినిమా పాటలు పాడకూడదని నిర్ణయించుకున్నారు. డబ్బు కోసం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయాన్ని మార్చుకోకూడదని ఘంటసాల నిర్ణయించుకున్నారు. చివరి వరకూ ఘంటసాల ఆ నిర్ణయానికే కట్టు బడి ఉన్నారు. భగవద్గీత గానం చేసిన తరువాత ఘంటసాల ఏ సినిమాకు పాటలు పాడలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: