అవునూ కాదూ అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాదిలో అమీష్ త్రిపాఠి అనే రచయిత ఉన్నారు. ఆయన ‘ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మేలుహా’ అనే పుస్తకం రాశారు. ఇందులోని ఆయుర్వతి పాత్రే... డమరుకం సినిమాలోని అనుష్క పాత్ర అంటున్నారు.
ఈ పుస్తకం పూర్తిగా శివుడిమీదే ఆధారపడి రాశారు. ఇందులో శివుడే హీరో. ఆ కథను మార్చి రాసి, నాగార్జునకు సరిపోయేలా చేశారట. ఇందులో నాగార్జున ఆటోడ్రైవర్ మల్లికార్జునగా కనిపించనున్నారు. పుస్తకం కవర్ మీద త్రిశూలం బొమ్మ, దానివెనుక శివుడు వెనక్కు తిరిగిన బొమ్మా ఉంటాయి.
డమరుకం పోస్టర్లలో కూడా ముఖ్యంగా త్రిశూలాన్నే వాడారు. కొన్నిచోట్ల నాగార్జున వెనక్కు తిరిగి త్రిశూలం పట్టుకున్న పోస్టర్లూ ఉన్నాయి. అంటే, ఆ పుస్తకంలోని అంశాలనూ, పుస్తకం కవర్ నూ కూడా కాపీ కొట్టారన్నమాట.
మరింత సమాచారం తెలుసుకోండి: